AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chevella Trs Mla: టీఆర్ఎస్‌ను వీడతారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోన్న వైఎస్ షర్మిలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య తనయుడు కలవడం..

Chevella Trs Mla: టీఆర్ఎస్‌ను వీడతారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..
Shiva Prajapati
|

Updated on: Feb 22, 2021 | 5:11 PM

Share

Chevella Trs Mla: తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోన్న వైఎస్ షర్మిలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య తనయుడు కలవడం అధికార పార్టీలో కలకం రేగింది. ఎమ్మెల్యే టీఆర్ఎస్‌ని వీడి షర్మిల పార్టీలో చేరుతారా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. దాంతో ఎమ్మెల్యే యాదయ్య స్పందించారు. తన కొడుకు షర్మిలను కలవడంపై క్లారిటీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చారు. ఆ భిమానం కారణంగానే తన కుమారు రవి.. వైఎస్ షర్మిలను కలిశాడని వివరణ ఇచ్చారు. అంతే తప్ప.. పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. అభిమానాన్ని రాజకీయం చేయాలని చూడటం సరైన పద్ధతి కాదన్నారు.

సోమవారం నాడు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని తన స్వగ్రామమైన చించెల్‌పేటలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ‘నా కొడుకు వైఎస్ షర్మిలను కలిసి మాట వాస్తవమే. కానీ, నా కొడుకు, నా కుటుంబంలో ఏ ఒక్కరూ పార్టీ మారే ఆలోచనలే లేదు. మా అధినేత కేసీఆర్, మా ముఖ్యమంత్రి కేసీఆర్.. చివరి వరకూ ఆయనతోనే ఉంటాం. టీఆర్ఎస్‌లోనే కొనసాగుతాం.’ అని స్పష్టం చేశారు.

Also read:

కిడ్నాప్ కు గురైనవారి రక్షణ చర్యలకు వెళ్తూ, నైజీరియాలో కూలిన విమానం, ఏడుగురి మృతి

ఓకే అడ్రస్‌తో ఏకంగా 70 పాస్‌పోర్టులు.. తీగ లాగితే కదులుతున్న డొంక.. షాకింగ్ విషయమేంటంటే?