పాకిస్తాన్‌లో మృత్యుఘోష.. వర్షాల, పిడుగుల కారణంగా 24 మంది మృతి.. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం..

రుతుపవనాల వర్షాలు కారణంగా ఈ రోజూ కురుస్తాయని.. వచ్చే 24 గంటల్లో పంజాబ్‌లోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని PDMA అంచనా వేసింది. రెస్క్యూ టీం తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో మునిగిపోయిన నేలమాళిగలో కుటుంబంలోని 11 మంది సభ్యులు చిక్కుకున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్‌లో దాదాపు 24 మంది చనిపోయారు.

పాకిస్తాన్‌లో మృత్యుఘోష.. వర్షాల, పిడుగుల కారణంగా 24 మంది మృతి.. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం..
Heavy Rains In Pakistan
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2024 | 9:37 AM

దాయాది దేశం పాకిస్థాన్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ దేశంలో ప్రతికూల వాతావరణం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కోహట్ జిల్లాలోని దర్రా అదమ్‌ఖేల్ ప్రాంతంలోని ఇంటి నేలమాళిగలో వర్షపు నీరు నిండిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి చెందారు. రెస్క్యూ టీం తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో మునిగిపోయిన నేలమాళిగలో కుటుంబంలోని 11 మంది సభ్యులు చిక్కుకున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. రెస్క్యూ అధికారులు మృతదేహాలను చట్టపరమైన లాంఛనాల కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్‌లో దాదాపు 24 మంది చనిపోయారు.

రుతుపవనాల వర్షాలు కారణంగా ఈ రోజూ కురుస్తాయని.. వచ్చే 24 గంటల్లో పంజాబ్‌లోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని PDMA అంచనా వేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొనసాగుతున్న రుతుపవన వర్షాల మధ్య పంజాబ్‌లోని అన్ని నదులు, కాలువలు సాధారణ నీటి ప్రవాహాన్ని కలిగి ఉన్నాయని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (PDMA) తెలిపింది. డ్యామ్‌లు, బ్యారేజీల్లో నీటి ప్రవాహం నిలకడగా ఉందని పీడీఎంఏ ప్రతినిధి తెలిపారు. మంగళ డ్యామ్‌లో ప్రస్తుత నీటిమట్టం 58%, తర్బేలా డ్యామ్‌లో 69% ఉంది. సట్లెజ్, బియాస్, రావి నదులపై నిర్మించిన భారతీయ డ్యామ్‌లలో నీటి మట్టం 39%కి చేరుకుంది.

పిడుగుపాటుకు పలువురు మృతి

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌లో సోమవారం పిడుగులు పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పొలాల్లో ఉండగా పిడుగుపాటుకు గురై అందరూ మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు, బాలుడు, వృద్ధుడు మృతి చెందారు.

వర్షం కారణంగా కూలిన ఇంటి పైకప్పు

జిల్లాలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు 40 ఏళ్ల వ్యక్తి, 11 ఏళ్ల బాలిక మృతి చెందారు. అంతేకాదు ఈ సంఘటనల్లో 20 జంతువులు కూడా మరణించాయి. రావల్పిండిలో భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ, ఆమె కుమార్తె మృతి చెందారు. సమాచారం ప్రకారం అమర్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి పైకప్పు కూలిపోయింది, దీని కారణంగా తల్లి, కుమార్తె శిధిలాల కింద చిక్కుకున్నారు. స్థానికుల సహాయంతో రెస్క్యూ టీమ్ చాలా శ్రమించి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. రెస్క్యూ టీమ్ మృతులను సమీప ఆసుపత్రికి తరలించి, వారి కుటుంబాలకు అప్పగించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?