Janmashtami 2024: జన్మాష్టమి రోజున ఏర్పడనున్న జయంతి యోగా.. ఈ సమయంలో పూజ శుభప్రదం..
ఈ సంవత్సరం జన్మాష్టమి రోజున చంద్రుడు వృషభరాశిలో ఉండటం వల్ల జయంతి యోగం ఏర్పడనుంది. ఈ శుభ సమయంలో పూజ చేసిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. జన్మాష్టమి రోజైన జయంతి యోగం ఆగస్టు 26వ తేదీ ఉదయం 12.01 గంటల నుండి 12.45 గంటల వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో భక్తులకు పూజలకు 45 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది.
పురాణ గ్రంధాల ప్రకారం శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు అష్టమి తిథి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ రోజు ఉపవాసం, పూజలు చేయడం వల్ల మనిషి శాశ్వతమైన పుణ్యాన్ని పొందుతాడని నమ్ముతారు. ఈసారి పంచాంగం ప్రకారం ఆగష్టు 26వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చింది. అయితే ఈ ఏడాది జన్మాష్టమి రోజున జయంతి యోగం కూడా ఏర్పడనుంది. ఈ యోగాలో పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, అయితే ఈసారి పూజ చేయడానికి మీకు కొంత సమయం మాత్రమే లభిస్తుంది.
జన్మాష్టమి 2024 తేదీ:
వేద క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి 25 ఆగస్టు 2024 ఆదివారం సాయంత్రం 06.09 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే 26 ఆగస్టు 2024 సోమవారం సాయంత్రం 04.49 గంటలకు అష్టమి తిధి ముగుస్తుంది.
కృష్ణ జన్మాష్టమి పూజా శుభ ముహూర్తం
ఈ సంవత్సరం జన్మాష్టమి రోజున చంద్రుడు వృషభరాశిలో ఉండటం వల్ల జయంతి యోగం ఏర్పడనుంది. ఈ శుభ సమయంలో పూజ చేసిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. జన్మాష్టమి రోజైన జయంతి యోగం ఆగస్టు 26వ తేదీ ఉదయం 12.01 గంటల నుండి 12.45 గంటల వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో భక్తులకు పూజలకు 45 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది.
జన్మాష్టమి రోహిణి నక్షత్రం ఎప్పుడంటే జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రం 26 ఆగస్టు 2024 ఉదయం 6.25 గంటలకు ప్రారంభమై 27 ఆగస్టు 2024 ఉదయం 6.8 గంటలకు ముగుస్తుంది. జన్మాష్టమి ఉపవాసం పాటించేవారు.. 2024 ఆగస్టు 27వ తేదీ ఉదయం 6.36 గంటల వరకు ఆచరించాల్సి ఉంటుంది.
కృష్ణ జన్మాష్టమి ప్రాముఖ్యత
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉపవాసం పాటించే వ్యక్తికి వంద జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు చాలా కాలం పాటు వైకుంఠ లోకంలో సుఖంగా ఉంటాడు. ఆ తరువాత మానవ జన్మనెత్తి శ్రీకృష్ణుని పట్ల భక్తితో జీవిస్తాడని విశ్వాసం.
అగ్ని పురాణం ప్రకారం జన్మాష్టమి రోజున ఉపవాసం చేసిన వ్యక్తీ గత జన్మల పాపం నశిస్తుందని.. జన్మ నుంచి విముక్తి పొందుతాడని విశేషం, అందుకే శ్రావణ కృష్ణ పక్షంలోని రోహిణి నక్షత్రం సహిత అష్టమి నాడు ఉపవాసం చేసి శ్రీ కృష్ణుడిని పూజించాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం ఉంటుంది. మరు జన్మ లేకుండా మోక్షం లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు