- Telugu News Photo Gallery Spiritual photos Nag Panchami 2024: Just do this one thing on the day of Nag Panchami , rahu ketu will become ineffective in the horoscope
Nag Panchami 2024: జాతకంలో రాహు కేతు దోషమా.. నివారణ కోసం నాగ పంచమి రోజున ఇలా పూజించండి..
హిందూ మతంలో చెట్లు, పక్షులుం, జంతువులు, పాములు కూడా దైవ స్వరూపాలే.. అంటే సమస్త జీవ రాశిలో దైవాన్ని చూడమని హిందూ సనాతన ధర్మం మానవుడికి సూచిస్తుంది. పాములను దైవంగా పూజించే ఆచారం ఉంది. సనాతన ధర్మంలో శ్రీ మహా విష్ణువుకి శేషుడు తల్పంగా మారితే శివుడి మేడలో నాగాభరణం పాములు. అంతటి విశిష్ట కలిగిన పాములను పూజించడానికి నాగా పంచమి, నాగుల చవితి వంటి వేడుకలు ఉన్నాయి. శ్రావణ మాసంలో జరుపుకునే పండగను నాగ పంచమి అంటారు. ఈ రోజున పాములను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యులపై పాముల దయ ఉంటుందని.. కుటుంబ సభ్యులు పాము కాటుతో చనిపోరని కూడా నమ్ముతారు.
Updated on: Jul 31, 2024 | 7:55 AM

శ్రావణ మాసంలో నాగపంచమి ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పంచమి తిథి నాడు నాగపంచమి జరుపుకుంటారు. వచ్చే ఆగస్టు 9 ముఖ్యమైన రోజు..ఈ రోజున నాగదేవతను పూర్ణ క్రతువు ప్రకారం పూజించే ఆచారం ఉంది.

నాగ పంచమి రోజున నాగదేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ఈ రోజున నాగదేవతను పూజించడం వల్ల జాతకంలో ఉన్న కాలసర్ప దోషం తొలగిపోతుందని నమ్మకం. భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజించడం వల్ల పాముల భయం తొలగిపోతుందని కూడా నమ్ముతారు. రాహు కేతువుల వలన కలిగే ఇబ్బందు కూడా తొలగుతాయని విశ్వాసం.

ప్రదోష సమయంలో నాగదేవుడిని పూజించడం ఉత్తమమని చెబుతారు. 12:30 PM నుంచి 1:00 PM వరకు నాగదేవుని ప్రత్యేక పూజ సమయం శుభప్రదం. ప్రదోష నాడు పూజ చేయలేకపోతే ఈ తిథిలో ఎప్పుడైనా పూజ చేయవచ్చు.

పురాణం ప్రకారం వాసుకి అనే నాగ పాము సముద్ర మథనం సమయంలో తాడుగా మారింది. నాగ పంచమి పండుగను పాము అసమానమైన పాత్రను దృష్టిలో ఉంచుకుని జరుపుకుంటారు. శ్రావణ శుక్ల పక్ష పంచమి నాడు శ్రీకృష్ణుడు బృందావనంలోని కాళింది మడుగులో ఉన్న విషపూరితమైన సర్పం నుంచి మానవ ప్రాణాలను రక్షించాడు.

అలాగే తక్షకుని అగ్ని వేడి నుండి రక్షించడానికి పాముకు పచ్చి పాలు పోస్తారు. తక్షకుడు మనుగడ సాగించడం వల్ల ఆ సమయంలో నాగ వంశం కూడా రక్షించబడింది. నాగ పంచమి నాడు నాగదేవతకు పాలు సమర్పించే ఆచారం అప్పటి నుండి ప్రారంభమైందని నమ్ముతారు.

నాగదేవుని అపారమైన అనుగ్రహాన్ని పొందడానికి నాగపంచమి రోజున అనేక నియమాలను పాటించాలి. ఈ రోజున అవసరమైన వారికి ఏదైనా దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన ప్రయోజనం పొందవచ్చు.

ఇంటి ముఖ ద్వారం ముందు పాము విగ్రహాన్ని లేదా మట్టితో చేసిన పాము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నాగదేవుని అనుగ్రహం పొందడంకోసం నాగదేవతకు పూలు, స్వీట్లు, పాలు సమర్పించవచ్చు. నాగ పంచమి రోజున పాములను బాధించకండి. కనుక సాగు చేసిన భూమిని దున్నవద్దు. చెట్లను నరకవద్దు.





























