కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): తృతీయ స్థానంలో శని, భాగ్య స్థానంలో గురు, కుజుల సంచారం ఆదాయాన్ని పెంచుతాయి కానీ, వ్యయ స్థానంలో సంచరిస్తున్న శుక్ర, బుధుల వల్ల అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే, నెలంతా ఆర్థికంగా బాగానే గడిచిపోతుంది. ఆకస్మిక ధన లాభం కూడా పొందు తారు. ఆదాయ మార్గాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపో తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకర పరిస్థితులు నెలకొంటాయి. పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. తరచూ అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పక పోవచ్చు. జీవిత భాగస్వామి తరఫు నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల వల్ల ఇబ్బందులు పడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. సుందరకాండ పారాయణం వల్ల మనసులోని కోరికలు నెరవేరు తాయి.