Chanakya Niti: పురుషుల కంటే స్త్రీలే తెలివైన వారన్న చాణక్య.. ఆ విషయంలో కూడా మహిళలే ముందుంటారట
స్త్రీలకు చాలా సహజసిద్ధమైన లక్షణాలు ఉంటాయని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అలాంటి లక్షణాల్లో ఒకటి సిట్యువేషనల్ మేనేజ్‌మెంట్‌లో మెరుగైన నాణ్యత. అంతే సందర్భానుసారంగా నిర్ణయాలను తీసుకునే నేర్పు మహిళలకు సొంతం. అవును మహిళలకు సహజంగానే మేనేజ్ మెంట్ స్కిల్స్ ఉంటాయన్నారు. అదే సమయంలో ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్త్రీలకు సంబంధించిన అనేక లక్షణాలను వివరించాడు.
స్త్రీలకు చాలా సహజసిద్ధమైన లక్షణాలు ఉంటాయని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అలాంటి లక్షణాల్లో ఒకటి సిట్యువేషనల్ మేనేజ్‌మెంట్‌లో మెరుగైన నాణ్యత. అంతే సందర్భానుసారంగా నిర్ణయాలను తీసుకునే నేర్పు మహిళలకు సొంతం. అవును మహిళలకు సహజంగానే మేనేజ్ మెంట్ స్కిల్స్ ఉంటాయన్నారు. అదే సమయంలో ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్త్రీలకు సంబంధించిన అనేక లక్షణాలను వివరించాడు. ఆచార్య చాణక్యుడు అనేక విషయాలలో పురుషుల కంటే స్త్రీల బలం గొప్పదని అభివర్ణించాడు.
స్త్రీణాం ద్విగుణ ఆహారో లజ్జా చాపి చతుర్గుణా సాహసం షడ్గుణం చైవ కామశ్చాష్టగుణః స్మృతః ।
ఈ శ్లోకంలో చాణక్యుడు స్త్రీల ధైర్యం, వారి గుణాలను వివరించాడు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఆకలితో ఉంటారని ఆచార్య చాణక్య చెప్పాడు. అంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఆరోగ్యం విషయానికి వస్తే పురుషుల కంటే మహిళలకే ఎక్కువ కేలరీలు అవసరం. కనుక స్త్రీలు సమృద్ధిగా ఆహారం తీసుకోవాలి.
ఆచార్య చాణక్యుడు పురుషుల కంటే స్త్రీలు తెలివైనవారని చెప్పారు. ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ సున్నితత్వం, తెలివైనవారుగా అభివర్ణించారు. ఎందుకంటే మహిళలు తమకు ఇచ్చిన పనులను చాలా తెలివిగా పూర్తిగా చేస్తారు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు తెలివితేటలతో, సున్నితత్వంతో పరిష్కారాలు కనుగొనే సత్తా మహిళలు సొంతం.
అదే సమయంలో సమాజంలో పురుషులు ధైర్యంగా పరిగణించబడతారు. కానీ చాణక్యుడు నీతి శాస్త్రంలో పురుషుల కంటే స్త్రీలు చాలా రెట్లు ఎక్కువ ధైర్యవంతులు అని వివరించాడు. చాణక్యుడు చెప్పిన ప్రకారం మహిళలు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ కారణంగా స్త్రీలు పురుషుల కంటే 6 రెట్లు (షట్గుణ) ధైర్యవంతులు.
ఆచార్య చాణక్యుడు తన శ్లోకం చివరలో పురుషుల కంటే స్త్రీలు చాలా రెట్లు ఎక్కువ ఇంద్రియాలను కలిగి ఉంటారని చెప్పారు. పురుషుల కంటే స్త్రీలలో 8 రెట్లు ఎక్కువ లైంగిక భావాలు ఉంటాయని చాణక్యుడు చెప్పాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు