AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హమాస్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఇరాన్‌లో హమాస్ చీఫ్ హనియా హత్య.. ఇజ్రాయెల్ పనేనా?

హనియా మృతిని ధృవీకరిస్తూ హమాస్ ఓ ప్రకటన కూడా వెలువరించింది. హనియా హత్య పిరికిపంద చర్య అని పేర్కోంది. అంతేకాదు హనియా మృతిలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని హమాస్ ఆరోపిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) తెలిపింది. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు.

హమాస్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఇరాన్‌లో హమాస్ చీఫ్ హనియా హత్య.. ఇజ్రాయెల్ పనేనా?
Hamas Chief Ismail Haniyeh
Surya Kala
|

Updated on: Jul 31, 2024 | 12:27 PM

Share

గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తోన్న హమాస్ ఉగ్రవాద సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌కు అతిపెద్ద శత్రువు.. హమాస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఇస్మాయిల్ 62 ఏళ్ల హనియా మృతి చెందాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హనియా హత్య చేయబడ్డాడు. క్షిపణి దాడిలో ఇస్మాయిల్ హనియా చనిపోయాడు. అతను టెహ్రాన్‌లో నివసిస్తున్నాడు. తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఈ దాడిలో అతని అంగరక్షకుడు కూడా చనిపోయాడు. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యి హనియా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు.

గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడికి ఇస్మాయిల్ హనియా ప్లాన్ చేశాడు. హమాస్ యోధులు హనియా ఆదేశానుసారం పని చేస్తారు. అతను 2006 నుంచి హమాస్ సంస్థకు సుప్రీం కమాండర్‌గా కొనసాగుతున్నాడు.

హనియా మృతిని ధృవీకరిస్తూ హమాస్ ఓ ప్రకటన కూడా వెలువరించింది. హనియా హత్య పిరికిపంద చర్య అని పేర్కోంది. అంతేకాదు హనియా మృతిలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని హమాస్ ఆరోపిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) తెలిపింది. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. హమాస్ అధినేత మృతి పట్ల పాలస్తీనా ప్రజలకు, ముస్లిం ప్రపంచానికి, హమాస్ యోధులకు సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటన పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అణ్వాయుధాలతో బెదిరిస్తూనే ఉన్న ఇరాన్

పాశ్చాత్య దేశాలకు అణు బెదిరింపులను కొనసాగిస్తున్న దేశం ఇరాన్. అంతేకాదు అమెరికా స్నేహ దేశమైన ఇజ్రాయెల్ ను తరచుగా కవ్విస్తూనే ఉంది. ఇది హౌతీ, హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్‌తో లేదా అమెరికాతో నేరుగా ఇరాన్ యుద్ధం చేయడం లేదు.. అయితే ఇరాన్ ఈ మూడు ఉగ్ర సంస్థలకు సహాయం చేస్తూ ఇజ్రాయెల్‌తో మాత్రమే కాదు అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలతో చెలగాటమాడుతోంది.

ఇప్పుడు తదుపరి ఏమిటి?

హనియా హత్య తర్వాత గాజాలో కార్యకలాపాలు నిర్వహించడం ఇజ్రాయెల్‌కు సులభతరం కావచ్చు. యాహ్యా సిన్వార్ హమాస్ ఆదేశాన్ని పొందవచ్చు. ఏరియా కమాండర్‌గా సింవర్‌ పాత్ర ఉంది.

హనియా గురించి తెలుసా?

హనియా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు నాయకుడు. ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్‌కియాన్‌ ప్రమాణ స్వీకారం కోసం ఆయన ఇరాన్‌లో పర్యటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హనియా ముగ్గురు పిల్లలు చనిపోయారు. అదే సమయంలో అతని సోదరి గత నెలలో మరణించింది.

హనియా 1962లో గాజా స్ట్రిప్‌లోని అల్-షాతీ శరణార్థి శిబిరంలో జన్మించాడు. గాజా ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలో అరబిక్ సాహిత్యాన్ని అభ్యసించాడు. హమాస్‌లో చేరాడు. 2006లో హమాస్ పాలస్తీనా శాసనసభ ఎన్నికలలో మెజారిటీ స్థానాలను గెలిచిన తర్వాత అతను సంస్థకు హనియా నాయకుడయ్యాడు.

గాజాలోని హనియా నివాసాన్ని ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలుగా ఉపయోగించారు. నవంబరులో జరిగిన IDF వైమానిక దాడికి కూడా అతను ప్రభావితమయ్యాడు. హనియా సాధారణంగా ఖతార్‌లో నివసిస్తాడు. హనియా మరణంపై ఇజ్రాయెల్ మంత్రి అమీహై ఎలియాహు మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రపంచం కొంతవరకు మెరుగుపడుతుందని అన్నారు. ప్రపంచాన్ని ఈ మురికి నుండి శుద్ధి చేసేందుకు ఇదే సరైన మార్గమని అన్నారు. ఈ మృతులపై కనికరం చూపించాల్సిన అవసరం లేదని అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..