పక్షికి CPR ఇచ్చి ప్రాణం పోసిన ఊరపిచ్చుక.. ఈ బుద్ధి మనిషికి లేకపోయే అంటారు వీడియో చూస్తే..

ఊరుకుల పరుగుల జీవితం యాంత్రికంగా మారిపోయింది. మనం మనది నుంచి నేను నాది అనే స్టేజ్ కు చేరుకున్నారు. ఎంతగా మరిపోయరంటే.. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా రోడ్డుమీద తమ సమీపంలో ఎవరైనా పడిపోతే చూస్తూ వెళ్ళిపోతున్నారు. లేదా రీల్స్ తీసి సోషల్ మీడియాలో తీసే పనిలో ఉంటున్నారు. మరి ఓ ఊరపిచ్చుక తన తోటి పిచ్చుక ప్రాణాల కోసం పోరాడుతూ విలవిలలాడుతుంటే చూడలేకపోయింది. శ్వాస అందక కొన ఊపిరితో పడి ఉన్న పిచ్చుక కు ప్రాణం పోయాలని ఆరాటపడింది. అంతేకాదు తోటి ప్రాణిని బతికించడం కోసం తన వంతు ప్రయత్నాలు చేసింది.

పక్షికి CPR ఇచ్చి ప్రాణం పోసిన ఊరపిచ్చుక.. ఈ బుద్ధి మనిషికి లేకపోయే అంటారు వీడియో చూస్తే..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2024 | 12:08 PM

మనిషిలో మానవత్వం అన్నది రోజు రోజుకీ మాయం అయిపోతుంది అని తెలిపే సంఘటనలు రోజురోజుకీ అధికం అవుతున్నాయి. సాటి మనిషి కష్టాల్లో ఉంటే సాయం చేయడం మరచి.. సెల్ ఫోన్ కు పని చెబుతున్నాడు. రీల్స్, ఫోటోలు, వీడియోలు తీసే హడావిడిలో ఉంటున్నాడు. అంతేకాని ఆపదలో ఉన్న వ్యక్తీ సాయం చేసి ఆదుకుందాం అన్న మాటని మరచిపోతున్నాడు. అయితే మనిషి మరచిపోతున్న మానవత్వం అన్న మాటను సాటి మనిషికి సాయం చెయ్యాలనే ఆలోచనను ఓ పక్షి గుర్తు చేస్తోంది. తాజాగా పక్షికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఒక ఊర పిచ్చుక ఎగురుతూ వచ్చి హటాత్తుగా కింద పడిపోయింది. అయితే అక్కడ ఉన్న తోటి పక్షి సీపీఆర్ చేసి బతికించింది. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. షేర్ల మీద షేర్ చేస్తూ పక్షిని చూసి ఇక నుంచి అయినా మనిషి తీరు మారాలని తోటి మనిషికి సాయం చేయాలనీ కామెంట్ చేస్తున్నారు.

ఊరుకుల పరుగుల జీవితం యాంత్రికంగా మారిపోయింది. మనం మనది నుంచి నేను నాది అనే స్టేజ్ కు చేరుకున్నారు. ఎంతగా మరిపోయరంటే.. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా రోడ్డుమీద తమ సమీపంలో ఎవరైనా పడిపోతే చూస్తూ వెళ్ళిపోతున్నారు. లేదా రీల్స్ తీసి సోషల్ మీడియాలో తీసే పనిలో ఉంటున్నారు. మరి ఓ ఊరపిచ్చుక తన తోటి పిచ్చుక ప్రాణాల కోసం పోరాడుతూ విలవిలలాడుతుంటే చూడలేకపోయింది. శ్వాస అందక కొన ఊపిరితో పడి ఉన్న పిచ్చుక కు ప్రాణం పోయాలని ఆరాటపడింది. అంతేకాదు తోటి ప్రాణిని బతికించడం కోసం తన వంతు ప్రయత్నాలు చేసింది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు శ్వాస ఆడని మనుషులకు సీపీఆర్ చేసినట్టుగా ఆ పిచ్చుకను అటు ఇటు కదిలించింది. అంతేకాదు పిచ్చుకని తన నోటితో పొడుస్తూ పక్షికి ఊపిరి అందించే ప్రయత్నం చేసింది. విశ్వ ప్రయత్నాలు చేసిన ఊర పిచ్చుక చివరకు తాను అనుకున్నది సాధించి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పిచ్చుకకు ఊపిరి పోసింది. శ్వాస అంది ప్రాణం తిరిగి వచ్చిన పిచ్చుక అక్కడ నుంచి ఎగిరిపోయింది. అది చూసిన ఊర పిచ్చుక కూడా సంతోషంతో అక్కడ నుంచి ఎగురుతూ వెళ్ళిపోయింది. ఈ సంఘటనను ఎవరో చిత్రీకరించి మనుషులకు ఈ తత్వం లేకపోయింది అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెటిజన్లు ఊరపిచ్చుక ప్రయత్నాన్ని సాటి పక్షి పట్ల ప్రేమని కొనియాడుతున్నారు. అదే సమయంలో అసలు ఆ సమయంలో సీపీఆర్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అని అంటున్నారు. అదే సమయంలో ఈ పిచ్చుక గుండెకు సంబంధించిన పాఠాలు విని ఉంటుంది. అందుకే ఈ ఆలోచన వచ్చింది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..