Viral Video: వెనుక గొడవ జరుగుతున్నా.. హ్యాపీగా రీల్ చేస్తోన్న యువతి.. నెటిజన్లు మండిపాటు
వైరల్‌గా మారిన ఓ వీడియో ఈ విషయాన్ని మారో సారి రుజువు చేసింది. పబ్లిక్ ప్లేస్‌లో కొంతమంది గొడవ పడుతున్నారు. ఈ విషయం వీడియోలో కనిపిస్తోంది. అయితే ఇలా గొడవ జరుగుతుంటే తనకు ఏమీ పట్టనట్లు ఒక అమ్మాయి కెమెరా ముందుకు పోజులిచ్చి రీల్ చేస్తూ నవ్వడం ప్రారంభించింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు తీవ్రంగా గొడవ పడుతున్నారు. ఈ గొడవను ఇతరులు ప్రేక్షకులుగా నిలబడి వినోదం చూస్తున్నట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే కోరిక ప్రజల సున్నితత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన అనేక సంఘటలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా వైరల్‌గా మారిన ఓ వీడియో ఈ విషయాన్ని మారో సారి రుజువు చేసింది. పబ్లిక్ ప్లేస్‌లో కొంతమంది గొడవ పడుతున్నారు. ఈ విషయం వీడియోలో కనిపిస్తోంది. అయితే ఇలా గొడవ జరుగుతుంటే తనకు ఏమీ పట్టనట్లు ఒక అమ్మాయి కెమెరా ముందుకు పోజులిచ్చి రీల్ చేస్తూ నవ్వడం ప్రారంభించింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు తీవ్రంగా గొడవ పడుతున్నారు. ఈ గొడవను ఇతరులు ప్రేక్షకులుగా నిలబడి వినోదం చూస్తున్నట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరింత షాకింగ్ విషయం ఏమిటంటే ఒక అమ్మాయి కెమెరా ముందుకు వచ్చి రీల్ చేయడం.
ఈ 21-సెకన్ల వీడియో @iNikhilsaini హ్యాండిల్‌తో Xలో షేర్ చేశారు. వినియోగదారు నిఖిల్ సైనీ క్యాప్షన్‌లో సిమ్లాలోని రిడ్జ్ క్రింగ్ గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి కార్యకలాపాలకు హాట్‌స్పాట్‌గా మారింది. రీల్ మేకర్స్ ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రతిరోజూ ఇలాంటి అర్ధం పదం లేని వీడియోలు చేస్తున్నారని పేర్కొంది.
వీడియో ఇక్కడ చూడండి
Over the last 2-3 years, Shimla’s Ridge has become a hotspot for cringe activities. Reel makers have taken over this place, and daily such nonsense videos are made.
A viral video on internet shows a girl making a reel during a fight ! Instead of stopping it they use it to make… pic.twitter.com/K0XvvwuJ8H
— Nikhil saini (@iNikhilsaini) July 26, 2024
గత 2-3 సంవత్సరాలుగా సిమ్లాలోని రిడ్జ్ భయంకరమైన కార్యకలాపాలకు హాట్‌స్పాట్‌గా మారింది. రీల్స్ చేస్తున్న వ్యక్తులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు రోజూ ఇలాంటి వీడియోలు తీస్తున్నారు.
ఈ వీడియోపై చాలా మంది వ్యాఖ్యానిస్తూ అమ్మాయికి అక్కడ జరుగుతున్న ఫైటింగ్ తో సంబంధం లేదని.. ఆమెకు రీల్ చేయడమే అత్యంత ముఖ్యమైన పని అన్నారు. బహుశా ఈ గొడవ కూడా అమ్మాయి స్క్రిప్ట్‌లో భాగమై ఉండవచ్చని కొందరు ఊహిస్తూ కామెంట్ చేశారు. అయితే ఇతరులకు సహాయం చేయడం కంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ సంఘటనపై తన పోస్ట్‌లో ఆందోళన వ్యక్తం చేసిన నిఖిల్.. ఆ వీడియోలో కొట్టుకున్న ఫైటర్స్, రీల్ చేస్తున్న యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పరిపాలనను అభ్యర్థించాడు. సోషల్ మీడియా క్రేజ్ ప్రజల నైతికత, ప్రాధాన్యతలను ఎలా మారుస్తుందో ఈ వీడియో చూపిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..