Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: భారత్‌తో యుద్దం చేసి తప్పు చేశాం.. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ శాంతి ప్రవచనాలు..

యుద్దంతో సర్వనాశనం.. భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని అన్నారు పాక్‌ ప్రధాని షెహబాజ్‌షరీఫ్‌. కశ్మీర్‌పై చర్చలకు సిద్దమన్నారు. అధిక ధరలతో పాక్‌ ప్రజలు అల్లాడుతుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో షెహబాజ్‌ శాంతిరాగం ఆలపిస్తున్నారు.

Pakistan: భారత్‌తో యుద్దం చేసి తప్పు చేశాం.. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ శాంతి ప్రవచనాలు..
Pakistan Pm Shehbaz
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 17, 2023 | 9:54 PM

తిండితిప్పలు లేక అలమటిస్తున్న పాకిస్తాన్‌ ఇప్పుడు దారికొస్తోంది. భారత్‌తో మూడు యుద్దాలు చేసి తప్పు చేశామని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒప్పుకున్నారు. ఆర్ధికసంక్షోభం నుంచి తమ దేశాన్ని గట్టెక్కించాలని కోరుతున్న షెహబాజ్‌ యుద్దాల నుంచి పాకిస్తాన్‌ గుణపాఠం నేర్చుకుందని అన్నారు. ఇండియాతో శాంతిని కోరుకుంటున్నామని ప్రకటించారు. కశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్చలకు ముందుకు రావాలని భారత్‌ను కోరారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరగాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు.

యుద్దం కారణంగా ఇరుదేశాలకు నష్టం జరుగుతోందని , ఆర్ధికవనరులను కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు పాక్‌ ప్రధాని. యుద్దాలతో ప్రజలకు చివరకు మిగిలింది పేదరికం, వేదన, నిరుద్యోగం మాత్రమే అని అన్నారు. ఉభయదేశాల దగ్గర ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని అన్నారు. . దక్షిణాసియా కోసం ఈ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఆయుధాల పోటీ రెండు దేశాలకు తీరని నష్టం చేస్తోందని అన్నారు షెహబాజ్‌ షరీఫ్‌.

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ తమ పౌరులకు కనీస నిత్యావసర వస్తువులను సబ్సిడీ కింద ఇవ్వలేకపోతోంది. ద్రవ్యోల్బణంతో పాక్‌ ప్రజలు అల్లాడిపోతున్నారు. గోధుమ పిండి కోసం పాకిస్తాన్‌లో యుద్దాలే జరుగుతున్నాయి. ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి.

ఇవి కూడా చదవండి

అధికధరలు , తాలిబన్ల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌ ఇప్పడు శాంతి ప్రవచనాలు వల్లిస్తోంది. యుద్దం వద్దని భారత్‌ను వేడుకుంటోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు