Trending Video: గుండు కొట్టించుకున్న క్యాన్సర్ పేషెంట్.. సెలూన్ బాయ్ ఏం చేశాడంటే.. హార్ట్ టచింగ్ వీడియో మీ కోసం..
క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలనే తీసేస్తుంది. క్యాన్సర్‌ను ఓడించిన చాలా మంది వ్యక్తుల గురించి మీరు వినే ఉంటారు. దీని ట్రీట్‌మెంట్‌కు చాలా డబ్బు ఖర్చయినా, సామాన్యుడికి...
క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలనే తీసేస్తుంది. క్యాన్సర్‌ను ఓడించిన చాలా మంది వ్యక్తుల గురించి మీరు వినే ఉంటారు. దీని ట్రీట్‌మెంట్‌కు చాలా డబ్బు ఖర్చయినా, సామాన్యుడికి వైద్యం అందడం చాలా కష్టం.క్యాన్సర్ తో బాధపడేవారి జుట్టు రాలిపోవడం మనకు తెలిసిందే. కానీ ఒక మహిళకు క్యాన్సర్ రావడంతో ఆమె జుట్టును షేవ్ చేయవలసి వచ్చింది. అది ఆమెకు ఎంత బాధ కలిగించిందో మీరు ఊహించలేరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక మహిళ.. సెలూన్ కు వెళ్తుంది. అక్కడ పని చేసే యువకుడు జుట్టు షేవ్ చేస్తున్న సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. జుట్టు పోతోందనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. అదే సమయంలో ఆ యువకుడు చేసిన పని ఆశ్చర్యం కలిగిస్తోంది.
కుర్చీలో కూర్చున్న మహిళ తన జుట్టును అద్దంలో చూసుకోవడాన్ని చూడవచ్చు. అదే సమయంలో యువకుడు ట్రిమ్మర్ తో జుట్టును కట్ చేస్తాడు. జుట్టు రాలడం చూసి ఆ మహిళ బోరున విలపించింది. దీంతో చలించిపోయిన ఆ యువకుడు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా ట్రిమ్మర్ తో తానూ షేవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఒక నిమిషం 21 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
A cancer patient visits her hairdresser and he does the unexpected ?pic.twitter.com/VK5EgAoahx
— Kevin W. (@Brink_Thinker) January 16, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..