AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: ఖమ్మం గుమ్మంలో గులాబీ గుబాళింపు.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం భారీ ఏర్పాట్లు

ఖమ్మం గుమ్మం నుంచి సమరశంఖం పూరించబోతోంది BRS. ఆవిర్భావ సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా.. జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలన్నదే మొదటి టార్గెట్.! రేపటి మీటింగ్‌లోనే పార్టీ ఎజెండా.. విధివిధానాలను ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్..

BRS: ఖమ్మం గుమ్మంలో గులాబీ గుబాళింపు.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం భారీ ఏర్పాట్లు
CM KCR's Bharat Rashtra Samithi
Sanjay Kasula
|

Updated on: Jan 17, 2023 | 10:02 PM

Share

ఖమ్మం సభ ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది బీఆర్ఎస్. సభకు ముగ్గురు సీఎంలు, నేషనల్ పార్టీల నేతలను ఆహ్వానించడం ద్వారా జాతీయస్థాయిలోనూ చర్చ జరిగేలా ప్లాన్ చేసింది. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయ్‌, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా ఇప్పటికే వచ్చేశారు. ఉదయం ప్రగతిభవన్‌లో అందరితో ప్రత్యేకంగా సమావేశం అవుతారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. దేశరాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.. బీఆర్ఎస్ ఎజెండా, విధివిధానాలపై రేపు కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని వివరించడం..

అదే మాదిరిగా దేశానికి ఏం అవసరం.. ఎలాంటి పథకాలు తీసుకొస్తామన్నది ప్రకటించనున్నారు. ఆప్‌, సీపీఎం, సీపీఐ, SP పార్టీల నేతల్ని ఆహ్వానించడం ద్వారా.. భవిష్యత్‌లో ఈ పార్టీలతోనే దోస్తీ ఉంటుందన్న సంకేతాలనూ ఇస్తున్నారు. విమర్శల సంగతి పక్కన పెడితే..ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లే చేసింది BRS .వంద ఎకరాల్లో సభ.. 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు..5 లక్షల మంది జనసమీకరణ టార్గెట్‌గా పెట్టుకున్నారు.

మొత్తం వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. హైదరాబాద్‌ నుంచి అతిథులతో కలిసి2 హెలికాఫ్టర్లలో మొదట యాదాద్రికి వెళ్తారు CM కేసీఆర్. దర్శనం తర్వాత నేరుగా ఖమ్మం చేరుకొని కలెక్టరేట్‌తోపాటు రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి

సభా వేదికపై ముఖ్య అతిథులతోపాటు.. ఖమ్మం జిల్లా BRS ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు మాత్రమే ఉంటారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వేదిక ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణంలో కూర్చుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు