Bald Head: మీరు తినే, తాగే వాటితో చిన్న వయసులోనే బట్టతల.. అవేంటో తెలిస్తే ఇప్పుడే మానేస్తారు..
ప్రస్తుతం ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఇలాంటి అలవాట్లతో యుక్తవయసులోనే బట్టతల బారిన పడుతున్నారు. ఈ రోజు నుండే మీరు ఈ డ్రింక్ నుంచి దూరంగా ఉండండి..
ఈ మధ్యకాలంలో యువత జీవనశైలిలో చాలా మార్పు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువత కూడా బట్టతల బారిన పడుతున్నారు. దీని వెనుక అనేక కారణాలు బయటకు వస్తున్నాయి. ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. అర్థరాత్రి వరకు పని చేయడం.. గంటల తరబడి మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై ఉండి కంప్యూటర్‌పై పనిచేయడం వంటి అలవాట్లు ఇందుకు కారణంగా మారుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటే.. వెంటనే సోడా వాటర్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ సోడాతో చేసే వంటకాలను అంటే బెకరీ ఫుడ్ తినేవారికి అతి త్వరలో బట్టతల బాధితులుగా మారుతున్నారని ఒక పరిశోధనలో వెల్లడైంది.
చైనాలోని సింగువా వర్శిటీలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆహారంలో ఉపయోగించే బేకింగ్ సోడాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పురుషులలో బట్టతల సమస్య పెరుగుతోందని ఇక్కడ ఒక పరిశోధనలో చెప్పబడింది. జీవనశైలిలో కాస్త మార్పు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చనేది ఉపశమనం కలిగించే విషయమే.
ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు
పురుషుల్లో జుట్టు రాలిపోయే ప్రమాదం 57 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. వాస్తవానికి పరిశోధకుడు 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల 1000 కంటే ఎక్కువ మంది ఆరోగ్యవంతమైన పురుషులపై ఈ అధ్యయనం చేశారు. అలాంటి పురుషులు రోజుకు ఒక్కసారైనా సోడాతో చేసే ఫుడ్ తినేవార తాగేవారని తేలింది. వారు జుట్టు రాలడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు కూడా సోడా ఎక్కువగా తాగడం, వాటితో తయారు చేసిన ఫుడ్ తింటే మీరు జాగ్రత్తగా ఉండాలి.
సోడా వంటలు ఎందుకు హానికరం
సోడా తాగడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం, వారానికి ఒకసారి కూడా సోడా తాగే పురుషులకు జుట్టు రాలిపోయే ప్రమాదం 21 శాతం ఎక్కువ. మరోవైపు, పురుషులు వారానికి రెండు నుండి నాలుగు సార్లు సోడా తాగితే, ఈ ప్రమాదం 26 శాతానికి పెరుగుతుంది. ఈ విధంగా, సోడా వినియోగం మీకు ప్రమాదం నుండి బయటపడదని అర్థం చేసుకోవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం