Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sakinalu Recipe: ఈ చిట్కా పాటిస్తే సకినాలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి.. ఏలా తయారు చేసుకోవాలంటే..

తెలంగాణలో ఏ శుభకార్యాలలో అయినా సకినాలు లేదా చకినాలు ఉండాల్సిందే. అన్ని శుభకార్యాలలో తయారు చేసుకునే పిండివంటలలో సకినాలు మొదటి ప్లాస్‌లో ఉంటాయి. ఇవి తింటే చలికాలంలో ఆరోగ్యం.

Sakinalu Recipe: ఈ చిట్కా పాటిస్తే సకినాలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి.. ఏలా తయారు చేసుకోవాలంటే..
Sakinalu Recipe
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 13, 2023 | 10:27 PM

సకినాలు.. తెలంగాణ రాష్ట్రంలో తయారుచేసే ఒక పిండి వంటకం (స్నాక్). బియ్యం పిండితో వృత్తాలుగా చేసి నూనెలో వేయిస్తారు తెలంగాణ పల్లెల్లో మకర సంక్రాంతి పండుగ సమయంలో ఈ వంటకాన్ని తయారుచేస్తారు. ఇవి చాలారోజులు నిల్వ ఉంటాయి.  తెలంగాణలో ఏ శుభకార్యాలలో అయినా సకినాలు లేదా చకినాలు ఉండాల్సిందే. అన్ని శుభకార్యాలలో తయారు చేసుకునే పిండివంటలలో సకినాలు మొదటి ప్లాస్‌లో ఉంటాయి. నవవధువు తల్లిదండ్రులు వారి బంధువులు, స్నేహితులకు పంపిణీ చేయడానికి వరుడి తల్లిదండ్రులకు ఇచ్చే అయిదు సారె బుట్టలలో ఒకటి సకినాల బుట్ట కూడా ఇస్తారు. జనవరిలో‌ విపరీతంగా ఉన్న చలి కారణంగా వచ్చే జలుబు, దగ్గు వంటి జబ్బుల నుండి ఉపశమనానికి సకినాలలో వేసిన ఓమ, అధిక చలి బాధ తగ్గించుకోవడానికి నువ్వులు ఒంటికి వెచ్చదనం ఇస్తాయి. అందుకే వీటిని సంక్రాంతి సమయంలో చేస్తారు. సకినాలు తయారుచేసే సమయంలో తొలి పెద్ద సకినము మధ్యలో గౌరమ్మను పెట్టి గౌరీ పూజ చేస్తారు

చకినము అంటే చక్రం లేదా వృత్తం అని అర్ధం. “సకినాలు” అనే పదం “చకినము” అనే పదం నుండి వచ్చింది. మకర సంక్రాంతి సమయంలో కొత్త వరి పంట పండించినప్పుడు రైతులు ఈ సంప్రదాయ పండుగ వంటకాలను తయారుచేసుకుంటారు. మూడు చుట్లతో ఈ సకినాలను చుడుతారు. ఇంటి ఆచారాన్ని బట్టి చుట్టల సంఖ్య పెరగడం, తగ్గడం ఉండవచ్చు.

చకినాల తయారీకి కావాల్సిన పదార్థాలు..

*తెల్ల నువ్వులు కొన్ని *పచ్చిమిర్చి కొన్ని లేదా కారం *ఉప్పు రుచికి సరిపడా *వాము కొద్దిగా

ఇవి కూడా చదవండి

ఏలా చేయాలంటే..

ముందుగా బియ్యం తీసుకుని సరిపడే నీటిలో నానబెట్టాలి. ఆ తడి బియ్యంను పిండి పట్టించాలి. కేజీ  పాత బియ్యం ఒకరోజు మొత్తం నానబెట్టిన తరువాత ఆ బియ్యాన్ని ఆరబెట్టిన తరువాత పిండి ఆడించాలి. పిండిని కాస్త తడి ఆరే దాకా ఎండలో పెట్టాలి. ఒక కిలో పిండికి కొలతల ప్రకారం 100 గ్రాముల నువ్వులు, వాము 10 గ్రాములు, నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలపాలి. ఇలా తయారైన పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుటూ ఉండాలి మరీ గట్టిగ కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోవాలి. అలా కలిపినా దానిని ఒక పదిహేను నిముషాల పాటు మూత పెట్టి ఉంచాలి. తర్వాత దానిని ఏదైనా కాటన్ వస్త్రంలో కట్టి పిండితో గుండ్రంగా చుట్టాలి. మొత్తం సకినాల ఆకారం వచ్చేదాక చుట్టాలి. వాటిని మరుగుతున్న నూనేలో వేసి గోలించుకోవాలి. అంతే రుచికరమైన సకినాలు రెడి అయిపోతాయి.

మీకు ఏ రకమైన షేప్స్ కావాలని అనుకుంటారో ఆ షేప్స్ లో చేసుకోవచ్చు. అయితే అన్నింటికంటే ముందుగా ఉట్టిని చేసుకుంటారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఉట్టిలు చేస్తారు. ఉట్టి అంటే మూడు చుట్లు కాకుండా కొద్దిగా పెద్దగా వేస్తారు. ఇది పలక షేప్‌లో ఉంటుంది. ఉదాహరణకు పలక, బలపం, రోలు, రోకలి మురుకు ఇంకా చాలా రకాల షేప్స్ లో చేసుకోవచ్చు. పిల్లలకు కావాల్సిన, ఇష్టమున్న షేప్స్ కూడా చేసుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు..

ఇక ఈ సకినాలలో ఉపయోగించే వాము కూడా జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది. సకినాల్లో ప్రధాన పదార్థం నువ్వులు. దీంట్లో పోషకాలు మెండు. ఇనుము శాతం అధికం. వీటిని తరచుగా తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంట్లో అమినోయాసిడ్‌లు, మెగ్నీషియం, మాంసకృత్తులు కూడా అధికం. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తంలోని చక్కెరస్థాయిని అదుపు చేయడంలో నువ్వుల పాత్రం గొప్పది. నువ్వులు తినడం వల్ల ఉబ్బస వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు సక్రమంగా పనిచేస్తాయి. వీటిలో సెసమాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ గుండె వ్యాధులను రానీయకుండా చేస్తుంది. లిగ్నిన్స్‌ అనే ఫైబర్‌ చెడు కొవ్వును దరిచేరనీయదు. నువ్వుల్లో ఉండే కాల్షియం మానసిక ఒత్తిడి నుంచి రక్షిస్తుంది.

మరిన్ని ఆహార వంటల కోసం