AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani: మరో రికార్డు కొట్టేసిన హైదరాబాద్ బిర్యానీ.. హెల్తీ ఫుడ్ గా గుర్తింపు.. ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో.. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది అసంఖ్యాకమైన అభిమానులను కలిగి ఉన్న ఆల్ టైమ్ టేస్టీ ఫుడ్. రుచిలో కమ్మని, ఆరోగ్యానికి మేలు చేసే బిర్యానీని చాలా మంది..

Biryani: మరో రికార్డు కొట్టేసిన హైదరాబాద్ బిర్యానీ.. హెల్తీ ఫుడ్ గా గుర్తింపు.. ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..
Hyderabadi Biryani
Ganesh Mudavath
|

Updated on: Jan 14, 2023 | 6:39 AM

Share

బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో.. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది అసంఖ్యాకమైన అభిమానులను కలిగి ఉన్న ఆల్ టైమ్ టేస్టీ ఫుడ్. రుచిలో కమ్మని, ఆరోగ్యానికి మేలు చేసే బిర్యానీని చాలా మంది పరిగణించరు. ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా కూడా నిరూపితమైంది. ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నివేదికలో.. బిర్యానీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి. హైదరాబాదీ బిర్యానీ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతే కాకుండా ఇది చాలా వరకు ఆరోగ్యకరమైనదని పరిశోధనలో తేలింది. ఇందులో బియ్యం, మాంసం, నూనె, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. హైదరాబాదీ బిర్యానీలో కోడిగుడ్డు, మాంసం, కూరగాయలు వాడటం వల్ల ఆరోగ్యవంతంగా తయారవుతుందని అధ్యయనంలో తేలింది.

బిర్యానీలో పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కుంకుమపువ్వు కలుపుతారు. ఇవన్నీ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బిర్యానీలో పసుపు, నల్ల మిరియాలు కలుపుతారు. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లితో వంటకం రుచికరంగా తయారవుతుంది. ఇవి మనల్ని ఆరోగ్యంగా కూడా చేస్తాయి. వీటిలో సల్ఫర్ సమ్మేళనాలు, మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ సి అధికంగా ఉంటాయి. బిర్యానీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..
జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..
అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!
అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!
ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..
ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..
అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో
అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో
గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్
గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్
భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో
భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో
సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్
సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్
అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..
అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తిరుమలలో శ్రీవారి కంటే ముందు ఆ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి..
తిరుమలలో శ్రీవారి కంటే ముందు ఆ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి..