Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: ఆదివారం నుంచి అందుబాటులోకి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. టైమింగ్స్, ఆగే స్టేషన్లు తదితర వివరాలివే

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి (సుమారు 700 కిలోమీటర్లు) కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది.

Vande Bharat Express: ఆదివారం నుంచి అందుబాటులోకి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. టైమింగ్స్, ఆగే స్టేషన్లు తదితర వివరాలివే
ఆ తర్వాత చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.
Follow us
Basha Shek

|

Updated on: Jan 13, 2023 | 9:17 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం(జనవరి 15) నుంచి అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్‌- విశాఖపట్నం నగరాల మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మొదట ఈ రైలును 19న ప్రారంభించాలనుకున్నారు. అయితే సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు రోజులు ముందుగానే అంటే జనవరి 15 నుంచే పట్టాల మీదకు తీసుకురానున్నారు. కాగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి (సుమారు 700 కిలోమీటర్లు) కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. కాగా ఈరైలు ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది(కేవలం 15వ తేదీ మాత్రమే ఈ స్టేషన్‌లలో ఆగుతుంది). రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత రెగ్యులర్ స్టాప్‌లో ఒక నిమిషం.. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఐదు నిమిషాలు ఆగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో ఈ ట్రైన్‌ ఆగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ రైలు నంబర్‌, ఆగే స్టేషన్లు, టైమింగ్స్‌ తదతర వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

వారంలో ఆరు రోజులు..

ఇవి కూడా చదవండి
  • ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికులకు సేవలందిస్తుంది.
  • విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్‌ రైలు (20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.
  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఈ రైలు (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే రైలు.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.
  • రైలులో మొత్తం 14 ఏసీ ఛైర్‌ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈ రైలును తీర్చిదిద్దారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ 2025 నోటిఫికేషన్‌
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ 2025 నోటిఫికేషన్‌
ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా?లేదా
ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా?లేదా
5 వరుస ఓటములకు చెక్.. కట్‌చేస్తే.. ధోనిసేనకు ఊహించని షాక్?
5 వరుస ఓటములకు చెక్.. కట్‌చేస్తే.. ధోనిసేనకు ఊహించని షాక్?
జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు
జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు
ఈ నటుడి భార్య కూడా చాలా పాపులర్.. ఆ జంట ఇప్పుడు ఎలా ఉన్నారంటే
ఈ నటుడి భార్య కూడా చాలా పాపులర్.. ఆ జంట ఇప్పుడు ఎలా ఉన్నారంటే
పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్..
పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్..
ఇంటర్ 2025 విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాలవెల్లడి తేదీలు వచ్చేశాయ్!
ఇంటర్ 2025 విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాలవెల్లడి తేదీలు వచ్చేశాయ్!
Video: 11 బంతుల్లో విధి రాతనే మార్చేసిన వింటేజ్ ధోని
Video: 11 బంతుల్లో విధి రాతనే మార్చేసిన వింటేజ్ ధోని