AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఊరెళ్తున్న కుటుంబాన్ని చిక్కుల్లో పడేసిన చైనా మాంజా.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి.. మెడకు చుట్టుకుని..

చైనా మాంజా చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు చైనా మాంజాతో పిల్లలు, పెద్దలతోపాటు జంతువుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది.

Hyderabad: ఊరెళ్తున్న కుటుంబాన్ని చిక్కుల్లో పడేసిన చైనా మాంజా.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి.. మెడకు చుట్టుకుని..
Chinese Manjha
Shaik Madar Saheb
|

Updated on: Jan 13, 2023 | 9:32 PM

Share

చైనా మాంజా చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు చైనా మాంజాతో పిల్లలు, పెద్దలతోపాటు జంతువుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ వేళ ఓ కుటుంబంలో చైనా మాంజా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం పాప ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని నాగోల్ ఫ్లైఓవర్‌పై శుక్రవారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న దంపతులు సంక్రాంతి పండుగ కోసం చిన్నారితో కలిసి బైక్‌పై సొంత గ్రామానికి వెళ్లేందుకు బయలు దేరారు. ఈ క్రమంలో నాగోల్ ఫ్లై‌ఓవర్ మీదుగా వెళ్తుండగా చైనా మాంజా నాలుగేళ్ల చిన్నారి మెడకు చుట్టుకుంది. అది గమనించే లోపే బైక్ కొంత దూరం వరకు వెళ్లింది. అప్పటికే పాప మెడ చాలా వరకు కోసుకుపోయి రక్తం ధారలా వచ్చింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారికి మెడ తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అయితే, చైనా మాంజా పాప మెడకు చుట్టుకోగానే.. చిన్నారి గట్టిగా అరిచింది. దీంతో తల్లిదండ్రులు బైక్ ఆపి చూడగా మెడ నుంచి రక్తం వస్తుండటంతో వెంటనే.. సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, చైనా మంజా చాలా ప్రమాదకరమైందని, దాన్ని ఉపయోగించొద్దంటూ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దాని విక్రయాలపై కూడా నిషేధం విధించారు.

ఇవి కూడా చదవండి

అయినప్పటికీ.. కొంత మంది వ్యాపారులు చైనా మాంజాలను అమ్ముతుండటంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు
మహానటి సావిత్రి చివరి రోజులు: ఒక విషాద గాథ
మహానటి సావిత్రి చివరి రోజులు: ఒక విషాద గాథ