TSPSC Group -1: గుడ్ న్యూస్.. గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మెయిన్స్ పరీక్ష అప్పుడే..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. పండుగకు ఒక రోజు ముందే టీఎస్పీఎస్సీ రిజల్స్ ను రిలీజ్ చేసింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంతో నిలిచిపోయిన...

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. పండుగకు ఒక రోజు ముందే టీఎస్పీఎస్సీ రిజల్స్ ను రిలీజ్ చేసింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంతో నిలిచిపోయిన ఫలితాలను విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ ఒక్క రీజన్ తో రిజల్ట్స్ ను రిలీజ్ చేయకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదని, ఇలా చేస్తే మిగతా అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతారని హైకోర్టు తెలిపింది. దీంతో గ్రూప్ -1 ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్ఫత్తిలో 25,050 మందిని సెలెక్ట్ చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. జూన్‌లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
కాగా.. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. వీటికి 3,80,081 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీ విడుదల అయింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని 5 ప్రశ్నలను తొలగించింది. అనంతరం నవంబర్ 15వ తేదీన ఫైనల్ కీ ని ప్రకటించింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..