TSRTC: అందుకే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లండి.. త్వరగా గమ్యానికి చేరుకోండి.. టోల్ ప్లాజా రద్దీపై సజ్జనార్ స్పందన..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో.. పిల్లలతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో సొంత వాహనాల్లో వెళ్లేందుకే...
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో.. పిల్లలతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో సొంత వాహనాల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితులతో టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి సొంత వాహనాల్లో భారీగా ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక్క విజయవాడ మార్గంలోనే జీఎంఆర్ సంస్థ అదనంగా 10 టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ పరిస్థితులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సొంత వాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దు. గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించవద్దు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు అని సజ్జనార్ చెప్పడం గమనార్హం.
టీఎస్ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్ @TSRTCHQ https://t.co/L60IEcGqYw
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 7, 2023
మరోవైపు.. టీఎస్ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. రద్దీని నివారించి, త్వరగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఈ చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..