Gold Price: తులం బంగారం ధర కేవలం రూపాయి మాత్రమే.. నమ్మకపోతే ఈ బిల్లు చూడండి.. కానీ..

70 ఏళ్ల క్రితం ఒక తులా బంగారం ధర ఎంత ఉండేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బంగారం ధర ఎంత ఉంటుందో అస్సలు ఊహించలేరు. ఆ ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు..

Gold Price: తులం బంగారం ధర కేవలం రూపాయి మాత్రమే.. నమ్మకపోతే ఈ బిల్లు చూడండి.. కానీ..
Gold
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 13, 2023 | 6:35 PM

ప్రస్తుతం, భారత్‌లో బంగారం ధర ఆకాశాన్ని తాకుతోంది. త్వరలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో బంగారం ధర మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో బంగారం ధర రూ. 60 వేలు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి, మీరు ఇంతకు ముందు వినని అటువంటి వార్త గురించి మేము మీకు ఇక్కడ చెప్పబోతున్నాం. 70 ఏళ్ల క్రితం ఒక తులం బంగారం ధర ఎంత ఉండేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బంగారం ధర ఇంత ఉండొచ్చని మీరు అస్సలు ఊహించలేరు. నేటి కాలంలో ఒక గ్రాము ధర చాలా ఎక్కువగా ఉంది. అప్పటి భారతీయులు.. అంటే మీ తాతల కాలంలో బంగారంను ఒకటి.. రెండు తులాలు కాకుండా గ్రాముల్లో కొనసేవారు. తక్కువల తక్కువ 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసేవారు.

ఇంట్లో ఎలాంటి వేడుక ఉన్నా పుత్తడి కొనాల్సిందే.. ఇది ఇప్పటి మాట కాదు తరతరాలుగా మన భారత్‌లో జరగుతున్నది ఇదే. అయితే ఎంత కొంటున్నరన్నదే మారింది. అప్పడు గ్రాముల్లో అంటే.. తక్కువల తక్కువ 100 గ్రాములు( సుమారు 10 గ్రాములు) కొనేవారు.. ఇప్పుడు లెక్క మారింది. తులం గోల్డ్ కొనాలంటే పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోవలి. ఆ గ్రామ్ గోల్డ్‌తో ఇప్పుడు స్వర్ణకారులు అద్భుతాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద మణిమారాలు చేసి పెడుతున్నారు. కానీ ఆ కాలంలో పచ్చల హారం ప్రతీ భారతీయ ఆడపడుచుల మెడలో ఉండేది. ఒక పచ్చల హారం అంటే సూమారు 10 నుంచి 15 తులాల బంగారం అవసరం అవుతుంది. అంటే ఊహించుకోండి ఎంతలా మనవారికి బంగారంపై క్రేజ్ ఉండేదో.. అయితే ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం..

70 ఏళ్ల క్రితం బంగారం ధర ఎంతో తెలుసా?

ఆ సమయంలో బంగారం ఎంత ధరకు విక్రయించబడిందో చూపించిన పాత బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్లిప్ బంగారం ధర రూ.113గా ఉన్న 1959 సంవత్సరం నాటిది. అయితే, ఓ బిజినెస్ సైట్ అందించిన లెక్కల ప్రకారం, 1960లో బంగారం ధర రూ. 112, ఒక రూపాయి తక్కువ. ఈ స్లిప్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఈ పాత బిల్లు మహారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందినదని తెలుస్తోంది. ఈ స్లిప్ పై దుకాణం పేరు కూడా రాసి ఉంది. M/s వామన్ నింబాజీ అష్టేకర్ పైన వ్రాయబడింది. దాని తేదీ 03 మార్చి 1959 అని వ్రాయబడింది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్లిప్ చేతితో వ్రాయబడింది.

ఇవి కూడా చదవండి

పాత బిల్లు స్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్

బంగారం కొన్న వ్యక్తి పేరు శివలింగ ఆత్మారామ్ అని రాసి ఉంది. రూ.621, రూ.251 విలువైన బంగారం కొనుగోలు చేసినట్లు బిల్లులో పేర్కొన్నారు. కాగా ఆ వ్యక్తి బంగారంతో పాటు వెండిని కూడా కొనుగోలు చేశారు. బంగారం కొన్న బిల్లు మొత్తం రూ.909గా రాసి ఉంది. ఈ బిల్లు చాలా పాతది. కానీ నేటికీ ఈ బిల్లుకు చాలా విలువ ఉంది. ఈ పాత బిల్లును చూసిన వెంటనే అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు బంగారం ఇంత చౌకగా ఉండేదంటే కూడా నమ్మలేకపోతున్నారు. ప్రస్తుతం పాత బిల్లులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం