Bainsa Sweet: భైంసా సంక్రాంతి స్పెషల్ మిఠాయి.. నోట్లో వేసుకుంటే కరిగిపోవల్సిందే.. ఏంటో తెలుసా..

ఆంధ్ర పూతరేకులు, కాకినాడ కాజా ఎంతప్రత్యేకమో... భైంసా పట్టణంలో గేవర మిఠాయి అంత ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపించని రాజస్థానీ రకం మిఠాయి గేవర. కేవలం భైంసాలో ప్రతి సంక్రాంతికి మాత్రమే తయారయ్యే ఈ వంటకం ప్రత్యేకతలేంటి?

Bainsa Sweet: భైంసా సంక్రాంతి స్పెషల్ మిఠాయి.. నోట్లో వేసుకుంటే కరిగిపోవల్సిందే.. ఏంటో తెలుసా..
Best Ghewar In Bhainsa
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 13, 2023 | 9:11 PM

భైంసా పట్టణంలో మాత్రమే తయారయ్యే సంక్రాంతి స్పెషల్ మిఠాయి గేవర. ఏడాదికి ఒకసారి సంక్రాంతికి తయారు చేస్తారిక్కడి మిఠాయివాలాలు. రాజస్థానీ రకం అయిన ఈ స్వీట్ సంక్రాంతి పండగకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భైంసా డివిజన్ లో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ స్వీట్ తిననివారు ఉండరు. సంక్రాంతిరోజు ఈ స్వీట్ తినడం ఒక ఆనవాయితీగా మారిందంటే అతిశయోక్తి కాదు..

గత కొన్ని దశాబ్దాలుగా రాజస్థానీలు బైంసాలో స్థిరపడి ఉన్నారు, మైదాపిండి, వనస్పతి, పాలు, నెయ్యి, చక్కెరతో తయారవుతుందీ మిఠాయి. దాదాపు 45 సంవత్సరాల కిందట భైంసా పట్టణ ప్రజలకు పరిచయం చేశారు మోహన్ లాల్ అనే రాజస్థానీ.

కేవలం సంక్రాంతి పండగ సీజన్లోనే ఈ రకం స్వీట్ దొరుకుతుంది. ఇక్కడ తయారుచేసే గేవర తెలంగాణలోని పలు జిల్లాలు, ఇతర రాష్ట్రాలను దాటి.. అమెరికా, దుబాయ్ లాంటి దేశాలకు సైతం ఎగుమతి అవుతోంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్వీటీకి మలాయి కలిపి మాలాయి గెవరను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్వీటు సంక్రాంతి పండగ రోజు కచ్చితంగా తినాలి అన్నంత రుచికరమైన తినుబండారంగా మారిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం