Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protect Car From Rat: కారులోకి ఎలుకలు రాకుండా ఇలా చేయండి.. ఒక్క చిట్కాతో దగ్గరకు అస్సలు రావు..

కారులోకి వచ్చే ఎలుకలను వదిలించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా.. మీరు ఎలుకలు కారులో రాకుండా అడ్డుకోవచ్చు. ఎలుకలు కారులోకి ప్రవేశించడం వల్ల కారు లోపల చాలా నష్టం వాటిల్లుతుంది. దాని మరమ్మతు కోసం మీరు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి అవసరం ఉండదు.

Protect Car From Rat: కారులోకి ఎలుకలు రాకుండా ఇలా చేయండి.. ఒక్క చిట్కాతో దగ్గరకు అస్సలు రావు..
Protect Car From Rat
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 15, 2023 | 6:32 PM

కారు కొనడం కంటే దానిని మెంటెన్సెన్స్ చాలా కష్టం. కొన్నిసార్లు, సరైన మెంటెన్స్ లేకపోవడం వల్ల కారులో అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కారును సమయానికి సర్వీస్ చేయాలి. కారుకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన సమస్య గురించి మాట్లాడుకుందాం.. ఇందులో ఎలుకలు చేసే సమస్యల్లో కారుకు చేసే సమస్య కూడా చాలా పెద్దది. మనం ఎంతో ప్రేమగా లక్షలు పెట్టి కారు కొనుగోలు చేస్తుంటాం. దానిపై మనతోపాటు మన కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి చిన్న గీత పడితేనే అయ్యో ఇలా పడిందే..! అని ఆదోళన చెందుతాం. అదే ఓ చిన్న ఎలుక కారులోకి చొరబడితే.. ఇంకేమైన ఉందా.. దానిలో ఎలాంటి విధ్వంసం చేసిందనే సందేహం మనలో మొదలవుతుంది.

కారును ఎలుకలు డ్యామేజ్ చేసిన తర్వాత బాధపడటం కంటే.. ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి సమస్య ఉండదు. ఇందుకోసం ఎం చేయాలో చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కారులోకి ఎలుకలు ప్రవేశించడం వల్ల మీకు వేలల్లో  ఖర్చు. చాలా ఎలుకలు కారులో తయారు చేసిన వెంట్ సహాయంతో లోపలికి ప్రవేశిస్తాయి. ఈ ఎలుకలు కారు వైర్, సీటు వంటి ముఖ్యమైన వాటిని కత్తిరించాయి. వారు ఏసీ పైపును కత్తిరించడం మొదలు పెడుతాయి. మళ్లీ మరమ్మతులు చేయాలంటే.. వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి కారులో ఎలుకల ఉనికిని గుర్తించినప్పుడల్లా వెంటనే అప్రమత్తంగా ఉండాలి. మీ కారులో ఎలుకలు రాకుండా చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఎలుకలను ఎలా వదిలించుకోవాలంటే..

  • కారును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కారు లోపలి నుంచి సరిగ్గా శుభ్రం చేయాలి.
  • ఆహార, పానీయాల కోసం వెతుకుతూ.. అవి కారు లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి ఆహారం, పానీయాలను కారులో ఉంచకూడదు. అంతేకాదు కారులోపల ఆహారం, స్నాక్స్ తినకండి. తింటే కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి.
  • మీ కారు ఎక్కువసేపు పార్కింగ్ స్థలంలో ఉంచినప్పుడు లైట్ల పూర్తిగా ఆర్పకుండా చూసుకోండి. సెలవు రోజున కారు సూర్యరశ్మి కారు లోపలికి వచ్చేలా పార్క్ చేయండి.
  • మీ కారును నీడ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయకుండా ప్లాన్ చేసుకోండి. ఎలుకలు సాధారణంగా చీకటి ప్రదేశాలలో ఉండేందుకు ఇష్టపడుతాయి. ఒక వేళ మీ కారులోకి ఎలుకలు చేరినట్లు మీకు అనిపిస్తే, వెంటనే కారును ఎండలో పార్క్ చేసి బానెట్ తెరవండి. ఎలుకలు వాటంతట అవే వెళ్లిపోతాయి.
  • ఎలుకను తరిమికొట్టే ఇలాంటి పరికరాలు ఎన్నో మార్కెట్‌లో ఉన్నాయి. ఎక్కువ రోజులు కారు ఒకే చోట పార్క్ చేయకూడదు. ఎలుకలను వదిలించుకోవడానికి మీరు కారులో పిప్పరమెంటు నూనెను కూడా ఉపయోగించవచ్చు.
  • ఒక్కోసారి మీ కారులోకి ఎలుకలు చేరినట్లైతే గట్టిగా హారన్ కొట్టండి. చాలా సేపు హారన్ మోగించడం వల్ల కారులో ఉన్న ఎలుకలు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం