Chanakya Niti: ఆఫీస్‌లో ఇలాంటి వ్యక్తులను ఎవరైనా ఇష్టపడతారు.. చాణక్యుడు చెప్పిన ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..?
చాణక్యుడు గొప్ప గురువు.. తన విధానాల బలంతో, అతను ఒక సాధారణ బాల చంద్రగుప్తుడిని సైతం చక్రవర్తిగా మార్చాడు. విజయవంతమైన జీవితం కోసం ప్రజలు నేటికీ ఆయన విధానాలను అనుసరిస్తుంటారు.
Chanakya Neeti: అచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో అంశాల గురించి ప్రస్తావించారు.. ఎలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాలను క్లుప్తంగా బోధించారు. చాణక్యుడు గొప్ప గురువు.. తన విధానాల బలంతో, అతను ఒక సాధారణ బాల చంద్రగుప్తుడిని సైతం చక్రవర్తిగా మార్చాడు. విజయవంతమైన జీవితం కోసం ప్రజలు నేటికీ ఆయన విధానాలను అనుసరిస్తుంటారు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. కుటుంబం, సంబంధాలు, విద్య, డబ్బు, వ్యాపారానికి సంబంధించిన విషయాలు నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు ఆఫీసులో ఎప్పుడూ చాలా ఇష్టపడే వ్యక్తుల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ వ్యక్తులు అత్యంత ప్రియమైనవారిగా గుర్తింపు పొందుతారంటూ వివరించాడు. ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
- ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా.. అందరినీ కలుపుకోని పోయే వారు, అందరికీ ప్రాధాన్యం ఇచ్చే వారు కొందరున్నారు. అలాంటి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. దీనివల్ల పని త్వరగా పూర్తి కావడమే కాకుండా కష్టాలను సులభంగా ఎదుర్కొనే ధైర్యం కూడా లభిస్తుంది. ఇలాంటి వారిలో ఎలాంటి న్యూనతా భావమూ ఉండదు. ఎవరైతే అందరినీ తమ వెంట తీసుకెళ్తారో, అలాంటి వారు అందరికీ నచ్చుతారు. ఇలాంటి వారిని సహచరులు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు.
- కార్యాలయంలోని ప్రతి వ్యక్తి.. పనిని గౌరవించే వ్యక్తులను చాలా ఇష్టపడతారు. అతను టీమ్ మెంబర్ అయినా లేదా ఆఫీస్ బాయ్ అయినా సరే.. ఇతరులను ఎవరు గౌరవిస్తారో, అలాంటి వ్యక్తులు కూడా ఎల్లప్పుడూ గౌరవం పొందుతారని వివరించాడు.
- ప్రతిభావంతులైన వ్యక్తిని ప్రోత్సహించే వ్యక్తులు కొందరు ఉంటారు. అలాంటి వ్యక్తి.. ఇతరుల ఆసక్తి, ప్రతిభను గుర్తించి పనిని అప్పగిస్తే, ఆ వ్యక్తి ఆ పనిని మరింత మెరుగ్గా చేస్తారు. ప్రతిభను ప్రోత్సహించే వ్యక్తులు కూడా గౌరవానికి అర్హులు.
- ఆచార్య చాణక్యుడు ప్రకారం ఇతరులకు సహాయం చేసే వారు అందరి మన్ననలు పొందుతారు. కార్యాలయంలో పనిచేసేవారు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. అలాంటి వారికి సహాయం చేసే వారు ఎల్లప్పుడూ సిబ్బందితో ప్రశంసలు పొందడంతోపాటు.. గౌరవం లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…