Trending: ఇదేం అడ్రస్ రా నాయనా.. డెలివరీ బాయ్ కే పిచ్చెక్కించాడు.. అసలు ఏం జరిగిందంటే..

నేటి యుగం ఆన్‌లైన్ యుగం. ముఖ్యంగా వస్తువుల కొనుగోలు విషయంలో అందరూ ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేకుండా.. ఫోన్ సహాయంతోనే కావాలసిన వస్తువులను ఇంటికి తెప్పించుకుంటున్నారు....

Trending: ఇదేం అడ్రస్ రా నాయనా.. డెలివరీ బాయ్ కే పిచ్చెక్కించాడు.. అసలు ఏం జరిగిందంటే..
Order Address Bill
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 18, 2023 | 6:58 AM

నేటి యుగం ఆన్‌లైన్ యుగం. ముఖ్యంగా వస్తువుల కొనుగోలు విషయంలో అందరూ ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేకుండా.. ఫోన్ సహాయంతోనే కావాలసిన వస్తువులను ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో ఆర్డర్ డెలివరీ చేయాల్సిన అడ్రస్ ను తప్పకుండా మెన్షన్ చేయాలి. లేకుంటే ఆర్డర్ ఎవరికీ ఇవ్వాలో తెలియక డెలివరీ బాయ్స్ తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుంది. సాధారణంగా ఇంటి నంబర్, కొన్ని ల్యాండ్‌మార్క్‌లను అడ్రస్‌లో యాడ్ చేస్తారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బహుశా ఈ అడ్రస్ చదివి డెలివరీ బాయ్ కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు.

వైరల్ అవుతున్న చిత్రంలో ఆర్డర్ చేసిన వస్తువు ఫ్లిప్‌కార్ట్ సంస్థకు చెందినదని తెలుస్తోంది. దానిపై ఇన్‌వాయిస్ అతికించారు. ఈ ఇన్‌వాయిస్‌లో షిప్పింగ్ చిరునామా ఉంది. ఇది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందింది. ఈ చిరునామా చాలా పొడవుగా ఉంది. ఈ వస్తువును ఆర్డర్ చేసిన వ్యక్తి పేరు భిఖారామ్. అతను చిరునామాలో ‘భిఖారం హరి సింగ్ నగర్ గిలాకోర్’ అని రాశాడు. ఊరికి ఒక కిలోమీటరు ముందు మా పొలం గేటు రైట్ సైడ్. ఇనుప గేటు ఉంది, దగ్గరలో ఒక చిన్న గేటు ఉంది. అక్కడకు వచ్చి నన్ను పిలవండి, నేను మీ దగ్గరకు వస్తాను’ అని ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 94 వేలకు పైగా వ్యూస్, 2 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తున్నారు. అంతే కాకుండా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!