Bandi Sanjay: బండి సంజయ్ కొడుకు భగీరథ్‌‌పై కేసు.. ర్యాగింగ్ పేరుతో విద్యార్థిపై దాడి.. యూనివర్సిటీ ఫిర్యాదుతో..

ర్యాగింగ్ పేరుతో ఓ విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో బండి భగీరథ్ పై కేసు నమోదు చేసినట్లు దుందిగల్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. విద్యార్థిపై బండి భగీరథ్..

Bandi Sanjay: బండి సంజయ్ కొడుకు భగీరథ్‌‌పై కేసు.. ర్యాగింగ్ పేరుతో విద్యార్థిపై దాడి.. యూనివర్సిటీ ఫిర్యాదుతో..
bandi sanjay son sai bhagirath
Follow us

|

Updated on: Jan 17, 2023 | 9:00 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తనయుడు బండి సాయి భగీరథ్‌‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ర్యాగింగ్ పేరుతో ఓ విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో బండి భగీరథ్ పై కేసు నమోదు చేసినట్లు దుందిగల్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. విద్యార్థిపై బండి భగీరథ్ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహేంద్ర యూనివర్సిటీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దుండిగల్ పోలీసులు వెల్లడించారు. ఐపీసీ 341, 322, 504, 506, 34 సెక్షన్ల కింద బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ డీసీపీ సందీప్ రావ్ వెల్లడించారు.

యూనివర్సిటీ డిసిప్లినరీ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భగీరథ్ పై కేసు నమోదు చేశామని సందీప్ రావు టీవీ9 కి తెలిపారు. మహీంద్రా యూనివర్సిటీ ఇచ్చిన ఆధారాల ప్రకారం కేసు విచారణ జరుపుతామని తెలిపారు. కాగా, ఈ ఘటన తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం బండి భగీరథ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, పాత వీడియోను ఇప్పుడు బయటపెట్టారంటూ బాధిత విద్యార్థి శ్రీరామ్ పేర్కొన్నాడు. తాను భగీరథ, నేను ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్‌ అని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ తక్కువగా ఉంటే ఏం తినాలి.?
ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ తక్కువగా ఉంటే ఏం తినాలి.?
ఏపీని బెంబేలెత్తిస్తోన్న వర్షాలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు..!
ఏపీని బెంబేలెత్తిస్తోన్న వర్షాలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు..!
నార్త్ లో చేసింది చాలు.. సౌత్‌ను షేక్ చేస్తా అంటున్న పూజ..
నార్త్ లో చేసింది చాలు.. సౌత్‌ను షేక్ చేస్తా అంటున్న పూజ..
కారులో వెళ్తూ వరదలో చిక్కుకున్న దంపతులు.. చివరకు ఏం జరిగిందంటే
కారులో వెళ్తూ వరదలో చిక్కుకున్న దంపతులు.. చివరకు ఏం జరిగిందంటే
పటౌడీ ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..
పటౌడీ ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..
హైదరాబాద్‌లో స్థలాలు, ఇళ్లు కొంటున్నారా.?ఇవిగో హైడ్రా కీలక సూచనలు
హైదరాబాద్‌లో స్థలాలు, ఇళ్లు కొంటున్నారా.?ఇవిగో హైడ్రా కీలక సూచనలు
సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో కొట్టుకుపోయిన రైతులు
సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో కొట్టుకుపోయిన రైతులు
హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో..
హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో..
తగ్గేదే లే.. ఫ్యాన్స్ కోసం ఎలాంటి పాత్రలకైనా రెడీ..
తగ్గేదే లే.. ఫ్యాన్స్ కోసం ఎలాంటి పాత్రలకైనా రెడీ..
శివబాలాజీ ఫిర్యాదుతో ఆ యూట్యూబర్‏ను అరెస్ట్ చేసిన పోలీసులు..
శివబాలాజీ ఫిర్యాదుతో ఆ యూట్యూబర్‏ను అరెస్ట్ చేసిన పోలీసులు..