Hyderabad: యువకుడు దారుణ హత్య.. అలా చేయడమే ప్రాణాలు తీసిందా.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

హైదరాబాద్‌లో 25 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో కత్తితో దాడి చేసి ప్రాణాలు తీసేశారు. లంగర్ హౌజ్‌లో ఆదివారం...

Hyderabad: యువకుడు దారుణ హత్య.. అలా చేయడమే ప్రాణాలు తీసిందా.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
Crime News
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 18, 2023 | 6:32 AM

హైదరాబాద్‌లో 25 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో కత్తితో దాడి చేసి ప్రాణాలు తీసేశారు. లంగర్ హౌజ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని వెంబడించడం, అతనిపై దాడి చేయడాన్ని చూడవచ్చు. యువకుడిపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ఆధారంగా.. యువకుడిని అతని భార్య సోదరులు హత్య చేసినట్లు భావిస్తున్నారు. గతేడాది అతనికి పెళ్లి అయింది. ఈ వివాహాన్ని యువతి తరఫు బంధువులు వ్యతిరేకించారు. అయినా వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం దావఖానాకు తరలించారు.అయితే, క‌లీమ్‌ను హ‌త్య చేసింది తామే అంటూ ముగ్గురు వ్యక్తులు గోల్కొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం