Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాకిస్థాన్‌కు శుభవార్త  చెప్పిన ఐఎంఎఫ్.. ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ‘ఔరంగజేబు’ చేతిలో

నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు ఆర్ధిక సహాయం చేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ ఐఎంఎఫ్ సమావేశాల్లో పాల్గోనున్నారు. IMF పశ్చిమాసియా, మధ్య ఆసియా విభాగం డైరెక్టర్ జిహాద్ అజోర్.. IMF, ప్రపంచ బ్యాంక్‌ల సమావేశం సందర్భంగా.. కొన్ని కీలక సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడే కొత్త కార్యక్రమంపై ఇంట్రస్ట్ నెలకొందన్నారు. 10 నెలల క్రితం ప్రారంభించిన కార్యక్రమాన్ని బట్టి చూస్తే.. ఆర్థిక స్థిరత్వం విషయంలో పాకిస్తాన్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించిందని చెప్పారు.

Pakistan: పాకిస్థాన్‌కు శుభవార్త  చెప్పిన ఐఎంఎఫ్.. ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు 'ఔరంగజేబు' చేతిలో
Pakistan Minister Muhammad Aurangzeb
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2024 | 6:45 PM

దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రజలు ఏమీ కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్టు లేదు అని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తాజాగా  పాకిస్థాన్‌కు శుభవార్త  చెప్పింది ఐఎంఎఫ్. నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు ఆర్ధిక సహాయం చేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ ఐఎంఎఫ్ సమావేశాల్లో పాల్గోనున్నారు.

IMF పశ్చిమాసియా, మధ్య ఆసియా విభాగం డైరెక్టర్ జిహాద్ అజోర్.. IMF, ప్రపంచ బ్యాంక్‌ల సమావేశం సందర్భంగా.. కొన్ని కీలక సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడే కొత్త కార్యక్రమంపై ఇంట్రస్ట్ నెలకొందన్నారు. 10 నెలల క్రితం ప్రారంభించిన కార్యక్రమాన్ని బట్టి చూస్తే.. ఆర్థిక స్థిరత్వం విషయంలో పాకిస్తాన్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించిందని చెప్పారు.

IMF ఆశాభావం

అంతకుముందు చేసిన రివ్యూ బాగుందని.. దానిని డైరెక్టర్ల బోర్డు ముందు ఉంచుతామని IMF అధికారి చెప్పారు. ఇది ఆర్థికంగా ఉన్న అసమతుల్యతను తొలగించి ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో పాకిస్తాన్‌కు సహాయపడినట్లు పేర్కొన్నారు. ఆ చర్యలు పాకిస్తాన్ ఆర్థికంగా బలపడడానికి ఉపకరించాయని అజోర్ అన్నారు. అయితే అధికారులు.. సవాళ్లను ఎదుర్కోవడంలో పాకిస్తాన్ కు హెల్ప్ చేసే కొత్త కార్యక్రమంపై ఆసక్తిని కనబరుస్తున్నారు

ఇవి కూడా చదవండి

పాక్ భవిష్యత్ ఇప్పుడు ‘ఔరంగజేబు’ చేతిలో

స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం ఇందులో ఒకటని ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ అన్నారు. బడ్జెట్ లోటు ను తగ్గించి, ఆదాయాన్ని పెంచి దాని ద్వారా ఆర్థికంగా బలపడేలా, ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేసేలా.. నిరంతర కృషి అవసరమన్నారు. ఇది దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటని చెప్పారు. ఆదాయంలో పెరిగితే.. అది ప్రభుత్వం రుణ పరిస్థితిని పరిష్కారమవుతుంది. అదనపు సామాజిక సహాయాన్ని అందించే అవకాశాన్నీ కల్పిస్తుందన్నారు. తమ రెండో లక్ష్యం ఇంధన రంగాన్ని మెరుగుపరచడమే అన్నారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌కు చాలా ముఖ్యమైనదని.. అయినా తాము ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ముహమ్మద్ ఔరంగజేబ్ అన్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబు మాత్రమే దేశాన్ని నడపగలరని అంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..