Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా కుకీస్‌ను జాగ్రత్తగా చూసి తినమని బేకరీ యాజమాన్యం హెచ్చరిక.. ఎగబడి కొంటున్న కస్టమర్స్.. రీజన్ ఏమిటంటే

తాము కొన్న వాటిని తినడం మానేస్తారు. ఆ కంపెనీ వైపు కన్నెత్తి చూడరు.. అయితే ఇక్కడ రివర్స్ జరుగుతుంది. కంపెనీ హెచ్చరించిన తర్వాత ప్రజలు కుకీలను భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో కంపెనీ చేసిన హెచ్చరిక మార్కెటింగ్ వ్యూహం కావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే హెచ్చరిక వెనుక కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది

మా కుకీస్‌ను జాగ్రత్తగా చూసి తినమని బేకరీ యాజమాన్యం హెచ్చరిక.. ఎగబడి కొంటున్న కస్టమర్స్.. రీజన్ ఏమిటంటే
Bakery Warn Customers
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2024 | 6:10 PM

అమెరికాలోని ఓ బేకరీ యాజమాన్యం తాము తయారుచేసిన కుకీలను జాగ్రత్తగా చూస్తూ తినమని కోరుతూ తమ కస్టమర్లకు హెచ్చరిక జారీ చేసింది.. సహజంగానే ఇలాంటి హెచ్చరిక వింటే ఎవరైనా షాక్ అవుతారు. తాము కొన్న వాటిని తినడం మానేస్తారు. ఆ కంపెనీ వైపు కన్నెత్తి చూడరు.. అయితే ఇక్కడ రివర్స్ జరుగుతుంది. కంపెనీ హెచ్చరించిన తర్వాత ప్రజలు కుకీలను భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో కంపెనీ చేసిన హెచ్చరిక మార్కెటింగ్ వ్యూహం కావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే హెచ్చరిక వెనుక కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మరి అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం?

లీవెన్‌వర్త్‌లో ఉన్న ‘సిస్ స్వీట్స్ కుకీస్ అండ్ కేఫ్’ తమ కస్టమర్స్ ను హెచ్చరించింది. దీని కారణం కూడా వెల్లడించింది. తమ సంస్థలో కుకీస్ తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు బేకరీ యజమాని డైమండ్ రింగ్ పిండిలో పడింది. చూడకుండా ఆ పిండిని ఉపయోగించి బిస్కట్స్ తయారు చేసేశారు. కనుక తమ సంస్థలో కొన్న బిస్కెట్స్ ను జాగ్రత్తగా తినాలని బేకరీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అయితే ఇక్కడ మరొక  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యజమాని తన కస్టమర్లకు ఎవరికైనా వజ్రం ముక్క దొరికితే తమకు  తెలియజేయమని కోరింది.

బేకరీ యజమాని ఏం చెప్పారంటే..

బేకరీ యజమాని డాన్ సిస్ మన్రో స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఆమె గత 36 ఏళ్లుగా డైమండ్ రింగ్ ధరిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల తాను షాప్ నుంచి కుకీస్ తయారు చేసే వంటగదికి వెళ్ళినప్పుడు తన ఉంగరం పడిపోయి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి

కేఫ్ అధికారిక ఖాతాలో ఈ సంఘటన గురించి సమాచారం ఇస్తూ.. మన్రో ఫేస్‌బుక్‌లో ఉంగరంను ఫోటోను కూడా షేర్ చేశారు. తన డైమండ్ రింగ్ కుక్కీస్ లో ఉండి ఉండవచ్చు కనుక మా కుక్కీలను కొంటే ఈ డైమండ్ బోనస్ అని పేర్కొన్నారు.

డైమండ్ ధర ఎంత అంటే

ఎవరికైనా డైమండ్ దొరికి.. దానిని తిరిగి తనకు ఇస్తే వారికి జీవితాంతం రుణపడి ఉంటాను అని ఆ మహిళ పేర్కొంది. నివేదిక ప్రకారం ఆ డైమండ్ మార్క్విస్ కట్.. ధర $4000 కంటే ఎక్కువ (మన దేశ కరెన్సీలో రూ. 3 లక్షల 33 వేల కంటే ఎక్కువ).

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..