చైనా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
పియోనీ (Peony) ఒక పుష్పం. ఇది ఆసియా, యూరప్ లతో పాటు పశ్చిమ ఉత్తర అమెరికాల్లో కనిపిస్తుంది. ఈ పువ్వును 'క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్' అని కూడా పిలుస్తారు. కొంతమంది దీనిని శృంగారానికి చిహ్నంగా కూడా భావిస్తారు. ఈ పువ్వులో రకరకాల రంగులున్నాయి. గులాబీ, ఎరుపు, పసుపు, తెలుపు, ఊదా, నీలం ఇలా దాదాపు 29 వర్ణాల్లో పియోనీ పుష్పాలు వికసిస్తాయి. పియోని పువ్వును ఉపయోగించి వజ్రాన్ని తయారు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని చైనా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
టెక్నాలజీ పరంగా చైనా ఎంత ముందుందో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ దేశంలో చిన్న చిప్‌ల నుంచి పెద్ద పెద్ద రోబోల వరకు ప్రతిదీ తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే చైనా కార్మికులకు కర్మాగారం వంటింది అని చెప్పవచ్చు. చైనీయుల పనిని సులభతరం చేసే విధంగా శాస్త్రవేత్తలు రకరకాల వస్తువులను సృష్టిస్తారు. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆలోచించేలా చేస్తాయి. ప్రస్తుతం ఈ దేశ శాస్త్రవేత్తలు అలాంటిదే చేశారు. వాస్తవానికి, చైనా శాస్త్రవేత్తలు ఎవరూ ఊహించని వస్తువులను ఉపయోగించి కృత్రిమ వజ్రాలను తయారు చేశారు.
ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. శాస్త్రవేత్తలు రెడ్ పియోనీ నుంచి ప్రత్యేకంగా తీసిన కార్బన్ మూలకాల నుంచి 3-క్యారెట్ వజ్రాన్ని సృష్టించారు. పియోనీ (Peony) ఒక పుష్పం. ఇది ఆసియా, యూరప్ లతో పాటు పశ్చిమ ఉత్తర అమెరికాల్లో కనిపిస్తుంది. ఈ పువ్వును ‘క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్’ అని కూడా పిలుస్తారు. కొంతమంది దీనిని శృంగారానికి చిహ్నంగా కూడా భావిస్తారు. ఈ పువ్వులో రకరకాల రంగులున్నాయి. గులాబీ, ఎరుపు, పసుపు, తెలుపు, ఊదా, నీలం ఇలా దాదాపు 29 వర్ణాల్లో పియోనీ పుష్పాలు వికసిస్తాయి. పియోని పువ్వును ఉపయోగించి వజ్రాన్ని తయారు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని చైనా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఈ సంస్థ ఈ ప్రత్యేకమైన వజ్రాన్ని తయారు చేసింది
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లుయోయాంగ్‌లో పియోని నుంచి లభించిన కార్బన్ మూలకాలతో తయారు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి వజ్రం ఇటీవల ఆవిష్కరించబడింది. సింథటిక్ డైమండ్‌లను ఉత్పత్తి చేసే లుయోయాంగ్ టైమ్ ప్రామిస్ అనే సంస్థ ఈ వజ్రాన్ని లుయోయాంగ్ నేషనల్ పియోనీ గార్డెన్‌కు విరాళంగా అందించింది. నివేదికల ప్రకారం గత నెలలో పియోనీ గార్డెన్ డైమండ్ కంపెనీకి ప్రత్యేకమైన వజ్రాన్ని తయారు చేయడానికి అవసరమైన పువ్వులను సరఫరా చేసింది. ఈ పువ్వుల్లో ఇందులో దాదాపు 50 ఏళ్ల పియోని పువ్వుకూడా ఉంది.
డైమండ్ ధర తెలిస్తే షాక్
ఈ విశిష్ట వజ్రం ధర 3 లక్షల యువాన్లు (అంటే మన దేశ కరెన్సీలో 35 లక్షల రూపాయల కంటే ఎక్కువ) అని లుయోయాంగ్ టైమ్ ప్రామిస్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద బయోజెనిక్ కార్బన్ ఎక్స్‌ట్రాక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వజ్రాన్ని తయారు చేశామని ఆయన చెప్పారు. కానీ పియోనీల నుండి లభించే కార్బన్ మూలకాలను వజ్రాలుగా మార్చడానికి ఉపయోగించే సాంకేతికత చాలా క్లిష్టమైనదని పేర్కొన్నారు.
వెంట్రుకలు, ఎముకలు, పువ్వుల నుంచి కార్బన్ మూలకాలను ప్రత్యేకంగా రూపొందించిన పరికరంతో వెలికితీసి, ఆ మూలకాలను డైమండ్ నిర్మాణంలో కలిపారని కంపెనీ వెల్లడించింది. ఈ విధంగా ఈ ప్రత్యేకమైన వజ్రం సిద్ధమైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..