స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే.. మీ బ్లడ్ బాయిల్ అవడం పక్కా

ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తన విధులను పక్కకు పెట్టి అందానికి మెరుగులు దిద్దుకుంది. పాఠశాలలో చదివే విద్యార్థులకు, చదువు చెప్పే టీచర్స్ కు ఆదర్శంగా మెలగాల్సిన ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకోవడానికి తాను చెప్పాల్సిన క్లాస్ కు డుమ్మా కొట్టమే కాదు.. స్కూల్ రూమ్ నే వేదికగా మార్చుకుంది. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.

స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే.. మీ బ్లడ్ బాయిల్ అవడం పక్కా
Principal Facial In School
Follow us

|

Updated on: Apr 19, 2024 | 5:16 PM

దేశాన్ని ఏలే రాజు సైతం ఒక గురువుకు విద్యార్ధే.. అవును ఒక పిల్లవాడి భవిష్యత్ ను అందంగా తీర్చిద్దిడేవారు ఉపాధ్యాయులు. అందుకే మన సంప్రదయంలో ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారు. కొని ఏళ్ల క్రితం వరకూ చదువు చెప్పే గురువు అంటే స్టూడెంట్స్ కు భయం, భక్తి, గౌరవం అంతమించి పూజ్యభావం.. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా చదువుల్లో..  చదువుకునే వారిలో..  చదువు చెప్పే వారిలో కూడా రాకరాక మార్పులు వచ్చాయి. టీచర్ ని గౌరవించే చోటే ఒక ఫ్రెండ్ గా ట్రీట్ చేసే రోజులు వచ్చేశాయి. అయితే ఇప్పటికీ కొందరు ఉపాధ్యాయులు తమ వృత్తిని ఎంతో గౌరవంగా.. అంకిత భావంగా నిర్వహిస్తుంటే.. కొందరు టీచర్స్ విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే తాగి స్కూల్ వచ్చిన టీచర్స్, విద్యార్థుల ముందు నిద్రపోయే ఉపాధ్యాయులు వంటి వారి గురించి వార్తలు వింటూనే ఉన్నాం//

తాజాగా ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తన విధులను పక్కకు పెట్టి అందానికి మెరుగులు దిద్దుకుంది. పాఠశాలలో చదివే విద్యార్థులకు, చదువు చెప్పే టీచర్స్ కు ఆదర్శంగా మెలగాల్సిన ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకోవడానికి తాను చెప్పాల్సిన క్లాస్ కు డుమ్మా కొట్టమే కాదు.. స్కూల్ రూమ్ నే వేదికగా మార్చుకుంది. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ పని చేస్తూ ప్రిన్సిపాల్ పట్టుబదిండి.. తాను చేసిన పనికి క్షమాపణ చెప్పలేదు సరి కదా.. అందుకు  బదులుగా తనను పట్టుకున్న అసిస్టెంట్ టీచర్‌ను తిట్టడమే కాదు చేయి కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈ విషయంపై పోలీసు అధికారి స్పందిస్తూ.. ఉన్నావ్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతా సింగ్ విద్యార్థులకు బోధించాల్సిన సమయంలో తెలిపారు.

బీఘపూర్ బ్లాక్‌లోని దండమౌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆహారం తయారుచేసే ప్రాంతంలో ప్రధానోపాధ్యాయురాలు సంగీతా సింగ్  ఫేషియల్ చేయించుకుంటుంది. ఈ విషయం అసిస్టెంట్ టీచర్ అనమ్ ఖాన్ దృష్టిలో పడింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అనమ్ ఖాన్ ప్రధానోపాధ్యాయురాలు చేస్తున్న పనిని సెల్ లో రికార్డ్ చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు కోపోద్రిక్తుడైన సంగీతా సింగ్ టీచర్‌ని వెంబడించి, కొట్టి, చేతిని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఆనం చేతులకు గాయాలైన గుర్తులు వీడియోలో కనిపిస్తున్నాయి. ఆమె చేతి మీద స్పష్టంగా నోటితో కోరినట్లు గుర్తులు ఉన్నారు. మరోవైపు రక్త మరకలున్నాయి.

తనపై ప్రిన్సిపాల్ దాడి చేసినట్లు అసిస్టెంట్ టీచర్ అనమ్ ఖాన్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన వీడియోను అసిస్టెంట్ టీచర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..