తొలిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే 18వ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడం కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని #VoteAsYouAre ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విమానయాన సంస్థ మొదటి సారి తన దేశీయ, అంతర్జాతీయ సర్వీసులలో విమాన టికెట్లపై 19 శాతం రాయితీని అందిస్తోంది.
మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే 18వ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడం కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని #VoteAsYouAre ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విమానయాన సంస్థ మొదటి సారి తన దేశీయ, అంతర్జాతీయ సర్వీసులలో విమాన టికెట్లపై 19 శాతం రాయితీని అందిస్తోంది. మొబైల్ యాప్, కంపెనీ వెబ్‌సైట్ నుంచి విమాన టికెట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ఓటర్లు సంబంధిత నియోజకవర్గానికి సమీపంలోని విమానాశ్రయానికి ప్రయాణించడం కోసం విమాన టికెట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లైట్, ఎక్స్‌ప్రెస్ వాల్యూ, ఎక్స్‌ప్రెస్ ఫ్లైక్స్, ఎక్స్‌ప్రెస్ బిజ్ విభాగాలకు వర్తిస్తుందని విమానయాన సంస్థ స్పష్టం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. 112వ ర్యాంక్ సాధించిన సాహి దర్శిని
అతలాకుతలమైన ఎడారి రాజ్యం !! ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తోందా ??
17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు.. మావోయిస్టులకు సింగం ఎన్‌కౌంటర్ల ‘లక్ష్మణ్’
Shikhar Dhawan: నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

