Micronesia First COVID-19 Case: ఏడాది తర్వాత ఆ ద్వీపంలో తొలి కరోనా కేసు నమోదు.. భయపడవద్దని ప్రజలకు అధ్యక్షుడు భరోసా

ఏడాదికి పైగా ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా వైరస్ తో వణికిపోతుంటే.. భూమి మీద కరోనా చొరబడని ప్రాంతంగా నిన్నమొన్నటి వరకూ నిలిచింది పసిఫిక్ ద్వీపంలోకి ఓ మారుమూల ప్రాంతం..

Micronesia First COVID-19 Case: ఏడాది తర్వాత ఆ ద్వీపంలో తొలి కరోనా కేసు నమోదు.. భయపడవద్దని ప్రజలకు అధ్యక్షుడు భరోసా
Follow us

|

Updated on: Jan 11, 2021 | 1:54 PM

Micronesia First COVID-19 Case: ఏడాదికి పైగా ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా వైరస్ తో వణికిపోతుంటే.. భూమి మీద కరోనా చొరబడని ప్రాంతంగా నిన్నమొన్నటి వరకూ నిలిచింది పసిఫిక్ ద్వీపంలోకి ఓ మారుమూల ప్రాంతం.. అయితే తాజాగా మైక్రోనేషియా దేశంలో కూడా సోమవారం తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటి వరకూ ఆ దేశం భూమిపై కొవిడ్ చొరబడని ప్రాంతంగా ఉన్న గుర్తింపును కోల్పోయింది.

ఫిలిప్పైన్స్‌లో మరమ్మతులో ఉన్న ప్రభుత్వ నౌకలోని సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఈ మొదటి కేసు బయటపడింది. వైరస్ సోకిన వ్యక్తితో పాటు తోటి వారు కూడా ఆ నౌకలోనే నిర్బంధంలోనే ఉంచామని ఆ దేశ అధ్యక్షుడు డేవిడ్ పాన్యులో చెప్పారు. వెంటనే ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ కేసును సరిహద్దుల వద్దే కట్టడి చేశామని వెల్లడించారు. పరిస్థితులు అదుపులో ఉన్నందున, ప్రజలు భయపడవద్దని భరోసానిచ్చారు. మైక్రోనేషియా దేశంలో సుమారు లక్ష మంది జనాభా నివసిస్తుంది. వ్యాపారాలు, పాఠశాలలు, చర్చిలు తెరిచే ఉంటాయన్నారు.

ప్రపంచ దేశాల్లో కోవిడ్ వెలుగులోకి వచ్చిన వెంటనే పసిఫిక్ ద్వీప దేశాలు కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో చురుగ్గా వ్యవహరించాయి. సరిహద్దులను మూసివేసి, వైరస్‌ను కట్టడి చేయడంలో విజయవంతమయ్యాయి. అందుకనే కిరిబటి, నౌరు, పలావు, టోంగా, తువలు వంటి దేశాల్లో ఏడాది గడిచినా ఇప్పటివరకు ఈ వైరస్ జాడలు కానరాలేదు. ఈ దేశాలన్నీ పర్యాటక రంగంపై ఆధారపడిన దేశాలే.. సరిహద్దులను మూసివేస్తే.. తమ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది.. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా.. అక్కడి ప్రభుత్వాలు వెనక్కి తగ్గలేదు.

Also Read : దేశ రాజధాని ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కలకలం… సంజయ్ పార్క్ లో బాతులు మృతి .. ప్రభుత్వం అలెర్ట్