India-China Border News: చైనా జవాన్ ను తిరిగి అప్పగించిన భారత ఆర్మీ.. గత నాలుగు నెలలో ఇది రెండోసారి
భారత్ భూభాగంలోకి ప్రవేశించిన చైనా జవానును సోమవారం ఇండియన్ ఆర్మీ ఆదేశానికి తిరిగి అప్పగించింది. వాస్తవాధీన రేఖను దాటి గత శుక్రవారం అర్ధరాత్రి పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో..

India-China Border News: భారత్ భూభాగంలోకి ప్రవేశించిన చైనా జవానును సోమవారం ఇండియన్ ఆర్మీ ఆదేశానికి తిరిగి అప్పగించింది. వాస్తవాధీన రేఖను దాటి గత శుక్రవారం అర్ధరాత్రి పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికుడి భారత్ భూభాగంలోకి ప్రవేశించగా.. భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అనంతరం దర్యాప్తులో ఆతను ఉద్దేశ్యపూర్వకంగా మన భూభాగంలోకి రాలేదని అధికారులు ధృవీకరించుకున్నారు. దీంతో చైనా విజ్ఞప్తి మేరకు ఈ రోజు ఉదయం తూర్పు లద్దాఖ్ లోని ఛుషుల్ మొల్డో సరిహద్దుల వద్ద చైనా జవాన్ ను ఆదేశ ఆర్మీకి అప్పగించినట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు.
అయితే గాల్వాన్ ఘర్షణ అనంతరం భారత్ చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఏర్పడిన తర్వాత చైనా జవాన్ భారత్ భూభాగంలోకి రావడం ఇది రెండో సారి. గతఏడాది అక్టోబర్‌లో తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మూడు రోజుల దర్యాప్తు అనంతరం ఆ జవాను తిరిగి చైనాకు అప్పగించిన సంగతి తెలిసిందే.
Also Read: 1947 తర్వాత తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్స్ సమావేశాలను నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం