Union Budget 2021: 1947 తర్వాత తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్స్ సమావేశాలను నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం

జనవరి  29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1947 తర్వాత తొలిసారి బడ్జెట్ పత్రాలను ముద్రించకూడదని...

Union Budget 2021: 1947 తర్వాత తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్స్  సమావేశాలను నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 11, 2021 | 5:28 PM

Union Budget 2021: జనవరి  29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1947 తర్వాత తొలిసారి బడ్జెట్ పత్రాలను ముద్రించకూడదని నిర్ణయంతీసుకుంది. ఈ నిర్ణయానికి పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఆమోదం లభించింది.  ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు సార్లు జరగనున్నాయి. మొదటి సారి సమావేశాలు ఈ నెల 29 నుంచి  ఫిబ్రవరి 15 వరకూ … రెండో విడత  మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకూ జరగనున్నాయి.  సమావేశం మొదటి రోజున రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించ‌నున్నారు.

ప్రతి సెషన్స్ సమయంలో ఉభయ సభలు ప్రతి రోజు నాలుగు గంటలు ఉంటాయి. బడ్జెట్ కు సంబంధించి కసరత్తు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే  మంత్రి నిర్మలా 2021-22  బడ్జెట్ కు సంబంధించి ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా పారిశ్రామివేత్తలు ఆర్థిక నిపుణులతో భేటీ అయ్యారు.

అయితే ఈ ఏడాది బడ్జెట్ గతంలో కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు బడ్జెట్ పాత్రలను ముద్రించడం లేమని .. కరోనా నేపథ్యంలో 100 మందికి పైగా వ్యక్తులను 15 రోజుల పాటు ప్రిటింగ్ ప్రెస్ లో ఉంచలేమని ఆర్ధిక శాఖ చెప్పాడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  బడ్జెట్ సాప్ట్ కాపీలను సభ్యులందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

Also Read: ఏడాది తర్వాత ఆ ద్వీపంలో తొలి కరోనా కేసు నమోదు.. భయపడవద్దని ప్రజలకు అధ్యక్షుడు భరోసా