Omicron Variant: ఆఫ్రికా ఖండం దాటి 20 దేశాల్లో అడుగు పెట్టిన ఒమిక్రాన్.. ఒక్క యూరోప్‌లోనే 44 కేసులు నమోదు
Omicron Variant: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి అయింది. ఇప్పటికి అనేక రూపాలను సంతరించుకున్న ఈ కోవిడ్ 19 కొత్త రూపాన్ని సంతరించుకుని..

Omicron Variant: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి అయింది. ఇప్పటికి అనేక రూపాలను సంతరించుకున్న ఈ కోవిడ్ 19 కొత్త రూపాన్ని సంతరించుకుని ప్రపంచ దేశాలను మళ్ళీ గజగజా వణికిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. అనేక దేశాల్లో క్రమంగా విస్తరిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని దాటి యూరోప్, ఆసియా ఖండాల్లో అడుగు పెట్టింది. పలు దేశాల్లో నేనున్నానంటూ వెలుగులోకి వచ్చి ఆందోళన పెంచుతోంది. తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 20 దేశాల్లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త వేరియంట్ యూరోపియన్ యూనియన్‌లోని 11 దేశాల్లో ఇప్పటివరకూ 44 కేసులు నమోదయ్యాయి. బాధితులలో చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారేనని తేలింది.
అయితే ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుక పై మళ్ళీ అనేక సందేహాలు కలుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూడడానికి ముందే ఈ కొత్త వేరియంట్ తమ దేశంలో నవంబర్ 19లో ఉన్నట్లు నెదర్లాండ్ ప్రకటించింది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ గత అక్టోబరులోనే పలు దేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అక్టోబరు ప్రారంభంలోనే నైజీరియాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైనట్లు ఆదేశ ప్రజాఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా వైరస్ నిర్ధారణ నిమిత్తం అక్టోబరులో సేకరించిన నమూనాలను పరీక్షించగా కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్లు స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా ఈ వేరియంట్ గురించి తెలుపుతూ.. ప్రపంచ దేశాలను అలెర్ట్ చేయడానికి ముందే ఆ దేశం నుంచి వచ్చిన ప్రయాణీకుల నమూనాలను తాము ఈ వైరస్ ను కనుగొన్నామని తెలిపింది.
ఒమిక్రాన్ వ్యాధి తీవ్రతపై ఇంకా అంచనా రాలేదని.. అయితే వేగంగా వ్యాపించే గుణం దీని సొంతమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు ఈ వైరస్ తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుంది.. వ్యాక్సిన్ ఈ వైరస్ నుంచి రక్షణ ఇస్తుందా లేదా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆసియా ఖండంలో అడుగు పెట్టింది.ల జపాన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో జపాన్ దేశం అత్యవసర చర్యలు తీసుకుంది.
హిందూ మహా సముద్రంలోని ఫ్రాన్స్ ద్వీపమైన రీయూనియన్లోనూ ఒమిక్రాన్ కేసు బయటపడింది. 53ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త రకం వైరస్ సోకింది. మొజాంబిక్ నుంచి రోగి దక్షిణాఫ్రికాలో దిగి.. అక్కడి నుంచి రీయూనియన్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు. నవంబరు 22 నుంచి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఆస్ట్రియా సర్కారు ఈనెల 11 వరకూ పొడిగించింది. ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణ కొరియాల్లో డెల్టా కారక కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. మరోవైపు క్రిస్మస్ రానున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాపించకుండా పలు దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read: