Andhra Pradesh: రోడ్డుపై గుంతలతో వాహన దారుల ఇబ్బందులు.. స్వయంగా మరమ్మతులు చేసిన ఎమ్మెల్యే ముస్తఫా..
ఈయనెవరో సూటు బూటు వేసుకొని రోడ్డుపై తాపీ పట్టుకుని పనిచేస్తున్నారనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా
ఈయనెవరో సూటు బూటు వేసుకొని రోడ్డుపై తాపీ పట్టుకుని పనిచేస్తున్నారనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా. గుంటూరు నగరంలో రద్దీగా ఉండే కాకాని రహదారిపై ఇటీవల భారీగాగుంతలు పడ్డాయి . ఆర్ అండ్ బీ వాళ్లు వాటి మరమ్మతులను పట్టించుకోవడం లేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఉండే ప్రజా ప్రతినిధుల్లో చాలామంది ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి, ఇంటి నుంచి కార్యాలయానికి ఈ రహదారి ద్వారానే ప్రయాణిస్తుంటారు.
ఈ క్రమంలో వాహనదారుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన తానే ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు.ఇందులో భాగంగా రెండు బస్తాలను తెప్పించిన ముస్తఫా వాటిని రోడ్డు గుంతలపై పోసి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై గుంతలు పూడ్చడం ఆయనకేమీ కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి మంచి పనులు చేశారు. రహదారి మరమ్మతులకు ఎమ్మెల్యేనే స్వయంగా రంగంలోకి దిగడంతో ఆర్ అండ్ బీ అధికారులు, సిబ్బంది ఆలస్యంగా మేల్కొన్నారు. ప్రధాన రహదారులపై గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు
నాగరాజు, గుంటూరు జిల్లా , TV9
Also Read:
Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ వివరాలివే..
Silver Price Today: దేశ వ్యాప్తంగా తగ్గిన వెండి ధరలు.. నేడు కిలో వెండి ధర ఎంత ఉందంటే..
Andhra Pradesh: విశాఖ ఏజెన్సీలో దారుణం.. చేతబడి చేశాడనే నెపంతో ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా..