Viral Video: తండ్రి చనిపోయాడన్న కనికరం చూపరా..? వివాదాస్పదంగా మారిన భారత కాన్సులేట్‌ అధికారి తీరు..

Viral Video: సోషల్‌ మీడియా కేవలం సంతోష క్షణాలను పంచుకోవడానికి మాత్రమే కాదు.. కష్టాలను కూడా షేర్‌ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అధికారం ఆధిపత్యం వహించిన చోట, సామాన్యులకు...

Viral Video: తండ్రి చనిపోయాడన్న కనికరం చూపరా..? వివాదాస్పదంగా మారిన భారత కాన్సులేట్‌ అధికారి తీరు..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 02, 2021 | 1:08 PM

Viral Video: సోషల్‌ మీడియా కేవలం సంతోష క్షణాలను పంచుకోవడానికి మాత్రమే కాదు.. కష్టాలను కూడా షేర్‌ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అధికారం ఆధిపత్యం వహించిన చోట, సామాన్యులకు న్యాయం జరగని తరుణంలో కూడా ప్రపంచానికి తమ కష్టాలను తెలపడానికి కొందరు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన ఇలాంటి ఓ సంఘటననే నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో స్థిరపడ్డ ఓ మహిళ తన తండ్రి మరణించడంతో భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్‌కు రావడానికి వీసా కోసం అప్లై చేసుకుంది. అందుకు సంబంధించిన డ్యాక్యుమెంట్లు, ఫీజుతో న్యూయార్క్‌లో ఉన్న ఇండియన్‌ కాన్సులేట్‌కు వెళ్లింది.

ఈ సమయంలో అక్కడ ఉన్న అధికారికి డ్యాక్యుమెంట్లు అందించి, వీసా మంజూరు చేయాలని కోరింది. కానీ ఆమె చెబుతోన్న మాటలను పెడచెవిన పెట్టిన సదరు అధికారి.. పైగా ఆ అమ్మాయిపై కఠినంగా విసుగ్గున్నాడు. సదరు మహిళ ఎంత బతిమిలాడుకున్నా పట్టించుకోకుండా డ్యాక్యుమెంట్లను పడేశాడు. అన్ని డ్యాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నప్పుడు వీసా ఎందుకు మంజూరు చేయరని ప్రశ్నించినప్పటికీ ఆ మహిళ మాటను అధికారి పట్టించుకోలేదు. దీంతో దీనంతటిని సీక్రెట్‌గా వీడియో తీసిందా మహిళా.

ఇది చూసిన సెక్యూరిటీ వచ్చి వీడియో తీయొద్దంటూ హెచ్చరించారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ టీవీ హోస్ట్‌ సిమి గరేవాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో సదరు అధికారి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read: Medaram Jathara: దగ్గరపడుతున్న మేడారం సమ్మక్క–సారక్క జాతర.. వసతుల ఏర్పాట్లలో వేగం పెంచిన ప్రభుత్వం..

Murder Plan: ఆ ఎమ్మెల్యేను చంపితే కోటి రూపాయలిస్తా.. సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత ఫోన్ కాల్..!

Viral Video: వరుడి వింత చేష్టలు.. వాన వెలిసేదాక ఆగలేకపోయాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..!