Omicron Variant: ఒమిక్రాన్ పుట్టుకపై అనుమానం.. దక్షిణాఫ్రికా కంటే ముందు.. మా దేశంలో పుట్టిందంటున్న మరో దేశం.
Omicron Variant: కరోనా వైరస్ రోజుకో రూపం సంతరించుకుంటూ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తమ దేశంలో..
Omicron Variant: కరోనా వైరస్ రోజుకో రూపం సంతరించుకుంటూ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తమ దేశంలో నవంబర్ 24న ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే మరో దేశం తమ దేశంలోకి ఈ వేరియంట్ ను నవంబర్ 19 నుంచి 23 మధ్య ఉన్నట్లు తెలిపింది. తమ దేశంలో ఈనెల 19 నుంచి 23 తేదీల మధ్య తీసిన నమూనాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించామని నెథర్లాండ్స్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఒమిక్రాన్ ఎప్పుడు, ఎక్కడ పుట్టిందనే అనే విషయంపై అనుమానం మొదలైంది.
కొరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి.. అని భావిస్తున్న తరుణంలో కోవిడ్ కొత్త రూపం ఒమిక్రాన్ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుగా హెచ్చరించింది. దీంతో ఈ వ్యక్తి తీవ్రత ఎంత.. ఏ విధంగా ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం ఉంటుంది అనే విషయంపై అందరినీ భయపెడుతోంది. ఇక రోజుకో దేశంలో వెలుగులోకి వస్తుంది.
యురేపియన్ దేశాలతో పాటు పలు ఆసియా దేశాల్లో కూడా తాజా వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోంది. ఈ వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన వెంటనే తమ దేశంలో చర్యలు చేపట్టిన జపాన్ లోనూ తొలికేసు నమోదయ్యింది. నమీబియా నుంచి ఆదివారం టోక్యోకు వచ్చిన ఓ 30ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్‌ను గుర్తించారు ప్రస్తుతం అతనికి క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. అంతేకాదు విమానంలో మిగిలిన అధికారులతో పాటు, సిబ్బందికి పరీక్షలను చేస్తున్నామని అధికారులు చెప్పారు.
Also Read: