Fortune India: ఫార్చ్యూన్ శక్తిమంతమైన మహిళల జాబితా విడుదల.. ఎవరెవరు ఉన్నారంటే..
ఫార్చ్యూన్ ఇండియా దేశంలోని 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి స్థానంలో ఉన్నారు...
ఫార్చ్యూన్ ఇండియా దేశంలోని 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ రెండో స్థానంలో నిలిచారు. డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజూందర్ షా, భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు, జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల టాప్-5లో ఉన్నారు.
కరోనా మహమ్మారి వంటి క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కీలకంగా వ్యవహరించారని ఫార్చ్యూన్ ఇండియా తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆత్మనిర్భర భారత్ ద్వారా ఎంఎస్‌ఎఈలకు చేయూత అందించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి చర్యలు ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టాయ తెలిపింది.
కోవిడ్ కారణంగా దేశమంతా లాక్‌డౌన్ విధించిన సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ తనవంతుగా సాయం చేశారని తెలిపింది. కరోనా ఆస్పత్రి, కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా, పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కుల తయారీ వంటి కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నీతా అంబానీ చేపట్టారని ఫార్య్చూన్ ఇండియా పేర్కొంది. కోవాగ్జిన్ తీసుకురావడంలో భారత్ బయోటెక్ జేఎండీ సేవలనూ ఫార్చ్యూన్ ఇండియా వివరించింది.
టాప్-10 జాబితా
1.నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి 2.నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ 3. సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ 4.కిరణ మజుందార్ షా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ 5.సుచిత్ర ఎల్లా, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ జేఎండీ 6.అరుంధతి భట్టాచార్య, సేల్స్‌ఫోర్స్ ఇండియా ఛైర్‌పర్సన్, సీఈవో 7.గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టె 8.టెస్సీ థామస్, డీఆర్‌డీవో శాస్త్రవేత్త 9.రేఖా ఎం.మీనన్, యాక్సెంచర్ ఛైర్‌పర్సన్, సీనియర్ ఎండీ 10.రెడ్డి సిస్టర్స్ (సంగీత, సునీత, ప్రీత, శోభన, అపోలో హాస్పిటల్స్)
Read Also.. BSNL 4G: దేశ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు.. ఎప్పటి వరకు అందుబాటులో వస్తాయో తెలిపిన కేంద్ర మంత్రి