- Telugu News Photo Gallery Business photos BSNL has given September 2022 timeline for pan India 4G rollout: MoS Telecom
BSNL 4G: దేశ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు.. ఎప్పటి వరకు అందుబాటులో వస్తాయో తెలిపిన కేంద్ర మంత్రి
BSNL 4G: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌లోగా దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సర్కార్..
Updated on: Dec 01, 2021 | 10:07 PM

BSNL 4G: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌లోగా దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి దేవ్ సిన్హా చౌహాన్ సమాధానం ఇచ్చారు.

దేశంలో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కంపెనీ తొలి ఏడాది ఆదాయం రూ.900 కోట్ల మేర పెరగనుందని తెలిపింది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌లో, ఎంటీఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి మరో ప్రతిపాదన లేదని మంత్రి అన్నారు.

ఇక రెండు టెలికాం కంపెనీల పునరుద్దరించడంలో భాగంగా 4జీ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది.

ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.1,33,952 కోట్లు, ఎంటీఎన్‌ఎన్‌కు రూ.3,556 కోట్ల ఆస్తులు ఉన్నాయని మంత్రి సభలో పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 20, 2021 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.85,721 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌కు రూ.30,159 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు.




