Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder Plan: ఆ ఎమ్మెల్యేను చంపితే కోటి రూపాయలిస్తా.. సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత ఫోన్ కాల్..!

Murder Plan: కర్నాటక కాంగ్రెస్ నేత ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే హత్యకు ఆయన చేసిన కుట్ర కన్నడ రాజకీయాల్లో పెను ప్రకంపనలు

Murder Plan: ఆ ఎమ్మెల్యేను చంపితే కోటి రూపాయలిస్తా.. సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత ఫోన్ కాల్..!
Mla Murder Plan
Follow us
Shiva Prajapati

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 02, 2021 | 10:48 AM

Murder Plan: కర్నాటక కాంగ్రెస్ నేత ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే హత్యకు ఆయన చేసిన కుట్ర కన్నడ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఏ ఎమ్మెల్యే హత్యకు కుట్ర పన్నారు.. ఆ కాంగ్రెస్ నేత ఎవరు? అనే వివరాలు తెలుసుకుందాం. బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేయాలంటూ కాంగ్రెస్ నేత ఫోన్‌లో మాట్లాడిన వీడియో కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్సార్ విశ్వనాథ్‌ను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడారు.

అయితే, ఈ సంభాషణలకు సంబంధించిన వీడియో ఫుటేజీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కన్నడ నాట పెను ప్రకంపనలు సృష్టించింది. బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్‌ హత్యకు కుట్ర జరిగిందని వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. కాంగ్రెస్ నేత గోపాలక్రిష్ణ మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వనాథ్‌కు భద్రత కల్పించాలని కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర పోలీసులను ఆదేశించారు. మరి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో.. కాంగ్రెస్ నేతలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ఫోన్‌లో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ.. వీడియో

Also read:

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..