Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న తరువాత అక్కడి పరిస్థితి దిగజారిపోయింది. మెజార్టీ ప్రజలు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత్ సహాయాన్ని తనదిగా చెప్పుకోవడానికి పాక్ ప్రయాస పడుతోంది.

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!
Afghanistan Crisis

Afghanistan Crisis: తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న తరువాత అక్కడి పరిస్థితి దిగజారిపోయింది. మెజార్టీ ప్రజలు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచంలోని అనేక సంస్థలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి కేకలను పట్టించుకోవాలని.. ప్రపంచం వెంటనే సహాయం చేయకపోతే, ఈ శీతాకాలం అక్కడి ప్రజలకు ప్రాణాంతకం అని చెబుతూ వచ్చాయి. అక్కడి మానవాళి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, కోట్లాది రూపాయల విలువైన 50 వేల టన్నుల గోధుమలు, మందులు, వైద్య పరికరాలను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపాలని భారతదేశం నిర్ణయించింది. ఈ వస్తువులను వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌కు, ఆపై ఆఫ్ఘనిస్థాన్‌కు పంపాల్సి ఉంటుంది. భారత్ నిర్ణయం తీసుకున్న 20 రోజుల తర్వాత తన మార్గాన్ని ఉపయోగించుకోవడానికి పాకిస్తాన్ అనుమతించింది. అయితే కొన్ని షరతులు పెట్టింది. ఈ షరతులతో పాకిస్తాన్ కుత్సిత బుద్ధి మరోసారి బయటపడింది. ఈ ఆంక్షలు ఏమిటి? పాకిస్తాన్ చేస్తున్న పనికిమాలిన పని ఏమిటి అనేది తెలుసుకుందాం.

భారత్ సహాయం ఇదీ..

యూఎస్, ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు, భారతదేశం 50 వేల టన్నుల గోధుమలు, మందులు, వైద్య పరికరాలను పంపుతున్నట్లు అక్టోబర్ 7న ప్రకటించింది. దీని కోసం, పాకిస్తాన్ నుండి సహాయం కోరింది. ఎందుకంటే ట్రక్కుల ద్వారా ఈ వస్తువులను వాఘా సరిహద్దు నుండి పాకిస్తాన్‌కు, తరువాత ఆఫ్ఘనిస్తాన్‌కు పంపవచ్చు. ఈ మార్గంలో పంపించడం వలన రెండు ముఖ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది – ఖర్చు తక్కువగా ఉంటుంది. రెండవది- వస్తువులను త్వరగా, సులభంగా పంపవచ్చు.

పాకిస్తాన్ కుత్సిత క్రీడ ఇదీ..

ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేసేలా భారత్ ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ, పాక్ సైన్యం ఊహించలేదు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 7న పంపిన అభ్యర్ధనకు పాకిస్థాన్ నవంబర్ 24న స్పందించింది. అందులో కొన్ని విచిత్రమైన షరతులు పెట్టింది. ఇవి ఇప్పుడు వెల్లడవుతున్నాయి. దీంతో పాకిస్థాన్ అసలు ముఖం కూడా ప్రపంచం ముందు స్పష్టంగా కనిపిస్తోంది.

పాకిస్తాన్ షరతులు ఇవే..

వాఘా సరిహద్దులో లోడింగ్-అన్‌లోడింగ్:

  • భారతదేశానికి చెందిన ట్రక్కులు వాఘా సరిహద్దులో వస్తువులను అన్‌లోడ్ చేయాలన్నది పాకిస్తాన్ షరతు.
  • అక్కడి నుంచి పాకిస్థాన్‌కు చెందిన ట్రక్కుల్లో ఎక్కించాలి.
  • ఆ తర్వాత ఈ ట్రక్కులు ఆఫ్ఘనిస్థాన్‌కు చేరుకుంటాయి.

పాక్ గేమ్ ఇదీ:

  • పాకిస్థాన్ ఒకే బాణంతో రెండు పక్షులను చంపాలనుకుంటోంది.
  • మొదటిది- పాకిస్తానీ ట్రక్కులు సహాయక సామగ్రిని తీసుకువెళుతున్నప్పుడు, దానిని మధ్యలో శుభ్రం చేయవచ్చు, అంటే దొంగిలించవచ్చు. వాటిని వారి గిడ్డంగులకు బదిలీ చేసుకోవచ్చు.
  • రెండవది- ట్రక్కులపై పాకిస్థాన్ జెండా ఉంటుంది. అఫ్ఘానిస్థాన్ ప్రజలు ఆకలి నుండి రక్షించడానికి, పాకిస్తాన్ గోధుమలు, మందులను పంపుతోందని ఆఫ్ఘాన్ ప్రజలు భావించాలి. పాకిస్తాన్ అక్కడ హీరోగా నిలబడాలి. అంటే భారత సొమ్ముతో తన డబ్బా కొట్టుకోవాలి!

ట్రక్ లకు రవాణా టాక్స్.. టోల్ టాక్స్ కట్టాలి..

మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించాలనుకుంటున్న సహాయ సామాగ్రి కోసం భారతదేశాన్ని పాకిస్తాన్ చాలా కోరికలు కోరుతోంది. రవాణా సుంకం అలాగే అక్కడి టోల్ పన్ను చెల్లించాలి. ఇది హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే, పాక్ ఒక వైపు వాఘా సరిహద్దు నుండి తన ట్రక్కులలో వస్తువులను పంపాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు భారతదేశం నుంచి పన్నులు కావాలని అడుగుతోంది.

భారతదేశం అన్నింటినీ అర్థం చేసుకుంటుంది..

భారత ప్రభుత్వం పాకిస్థాన్ పరిస్థితులను లేదా డిమాండ్లను బాగా అర్థం చేసుకుంది. అఫ్ఘానిస్థాన్‌ వరకు భారత ట్రక్కులు మాత్రమే వెళ్తాయని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేయడానికి ఇదే కారణం. యూఎన్ బృందం ఈ ట్రక్కులతో పాటు ఉంటుంది. ఛార్జీలు లేదా టోల్ పన్నుపై మాత్రం స్పష్టత లేదు.

తాలిబన్లు కూడా జోక్యం చేసుకోకూడదు

మీడియా నివేదికల ప్రకారం, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు నేరుగా అవసరమైన వారికి సహాయ సామగ్రి అందాలని కోరుతోంది. ఇందులో తాలిబన్ ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఈ లాజిస్టిక్స్‌ను తాలిబాన్‌లకు అప్పగిస్తే, అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. బహుశా పాకిస్థాన్‌కు కూడా కొంత వాటా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఐక్యరాజ్యసమితి సిబ్బంది ఆకలితో ఉన్న ఆఫ్ఘన్‌లకు నేరుగా పంపిణీ చేయాలి.

ఇమ్రాన్ తాను అతని మంత్రులు ఆగస్టు 15 నుంచి ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్ పాలన చేపట్టడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసింది. కానీ, ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ఆకలిని తీర్చడంలో మాత్రం వెనక్కి తగ్గింది. ప్రపంచం ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేయాలని పదేపదే చెబుతోంది. ప్రజలు ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందని నివేదికలు వస్తున్నాయి. ఇప్పుడు సాయం చేయాలని భారత్ నిర్ణయించడంతో పాకిస్తాన్ అనవసర షరతులు పెట్టింది. ఐక్యరాజ్యసమితి మిషన్ ద్వారా ప్రతి దేశం తన చేష్టలను గమనిస్తోందని పాకిస్తాన్ పాలకులు బహుశా మర్చిపోయారు. భవిష్యత్ లో పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్న చేష్టలకు తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చని పరిశీలకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Venkatesh Iyer: గతంలో 20 లక్షలు..ఇప్పుడు 8 కోట్లు.. ఐపీఎల్‌ రిటెన్షన్‌లో జాక్‌పాట్‌ కొట్టిన వెంకటేష్‌ అయ్యర్‌..

Viral News: సీటులో కూర్చోమన్న తోటి ప్రయాణికులపై పోలీస్ కానిస్టేబుల్ వీరంగం.. కండక్టర్ ఏం చేశాడంటే!

Tirumala: శ్రీవారి భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది.. ఆరునెలల్లోపు మళ్లీ దర్శనం తేదీ మార్చుకోవచ్చు.. టీటీడీ ఛైర్మన్‌

Published On - 3:29 pm, Wed, 1 December 21

Click on your DTH Provider to Add TV9 Telugu