మాతో చర్చలా ..? అమెరికా ఆశలను అపహాస్యం చేసిన నార్త్ కొరియా… స్పందించని యూఎస్
అమెరికాతో అవసరమైతే చర్చలకు సిద్ధమంటూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల చేసిన వ్యాఖ్యపై అమెరికా స్పందనను కిమ్ సోదరి, సీనియర్ అధికారి కిమ్ యో జోంగ్ అపహాస్యం చేశారు. చూడబోతే అమెరికా తన స్వప్రయోజనాల
అమెరికాతో అవసరమైతే చర్చలకు సిద్ధమంటూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల చేసిన వ్యాఖ్యపై అమెరికా స్పందనను కిమ్ సోదరి, సీనియర్ అధికారి కిమ్ యో జోంగ్ అపహాస్యం చేశారు. చూడబోతే అమెరికా తన స్వప్రయోజనాల కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. నార్త్. సౌత్ కొరియా మధ్య తమ పాలసీని కోఆర్డినేట్ చేయడానికి ఏర్పాటైన వివాదాస్పద వర్కింగ్ గ్రూపును రద్దు చేసే విషయాన్ని పరిశీలించాలని అమెరికా కోరగా..ఇందుకు సౌత్ కొరియా కూడా అంగీకరించిందని ఆమె అన్నారు. నిజానికి ఈ వర్కింగ్ మా ఉభయ దేశాల మధ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికాతో సంప్రదింపులకు తాము సిద్ధమన్నట్టు కిమ్ చేసిన ప్రకటనపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవన్ చేసిన ప్రకటనను జోంగ్ గుర్తు చేశారు. ఇది ఆసక్తికరమైన పరిణామమని (ఇంట్రెస్టింగ్ సిగ్నల్) అని ఆయన వ్యాఖ్యానించారని, కానీ యూఎస్ తన వైఖరిని తప్పుడు మార్గంలో చూపడానికి యత్నిస్తోందని ఆమె విమర్శించారు. కానీ ఇది ఆ దేశ అసంతృప్తికే దారి తీస్తుందని హెచ్చరించారు.
డీన్యూక్లియరైజేషన్, పరస్పర సహాయం వంటి అంశాలపై సమన్వయ సహకారం కోసం 2018 లో ఈ వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ గ్రూపును రద్దు చేసే విషయాన్నీ పరిశీలించాలని మొదట అమెరికా సౌత్ కొరియాను కోరింది. అసలే ఆహార కొరత లాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశానికి ఈ గ్రూప్ సాయం అవసరమవుతుందని నార్త్ కొరియా భావిస్తోంది. అలాంటిది దీన్ని రద్దు చేయాలనుకోవడం తమ దేశ ప్రయోజనాలను దెబ్బ తీయడానికేనని ఇప్పుడు అభిప్రాయపడుతోంది. కాగా ఇది తెలివైన రాజకీయ చర్య అని సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ అంటున్నారు. అమెరికాను ఆయన ప్రశ్జంసించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నేడో, రేపో టీపీసీసీ కొత్త చీఫ్..!కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తులకు బ్రేక్ :Telangana New PCC Chief ? Live Video
viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.
Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్ క్లారిటీ వీడియో .