AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nobel Prize: రసాయనశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి.. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రధానం

క్లిక్ కెమిస్ట్రీ , బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ అని పిలువబడే సాంకేతిక కణాలను గుర్తించడానికి..  జీవ ప్రక్రియలను ట్రాక్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయని అవార్డు పొందిన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Nobel Prize: రసాయనశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి.. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రధానం
Nobel Prize In Chemistry
Surya Kala
|

Updated on: Oct 06, 2022 | 9:01 AM

Share

రసాయన శాస్త్రానికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. క్లిక్, బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీని అభివృద్ధి చేసినందుకు ముగ్గురు శాస్త్రవేత్తలను బుధవారం ఈ అవార్డుతో సత్కరించారు. వీరిలో కరోలిన్ R. బెర్టోజీ , మోర్టన్ మెడెల్, కే బారీ షార్ప్‌లెస్ ఉన్నారు. షార్ప్‌లెస్, 81, 2001లో మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి ఈ అవార్డుతో సత్కరించారు. క్లిక్ కెమిస్ట్రీ , బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ అని పిలువబడే సాంకేతిక కణాలను గుర్తించడానికి..  జీవ ప్రక్రియలను ట్రాక్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయని అవార్డు పొందిన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రకటన ప్రకారం బయోఆర్తోగోనల్ ప్రక్రియల ఉపయోగం పరిశోధకులకు క్యాన్సర్ ఫార్మాస్యూటికల్‌లను పరిశోధించడం సులభతరం చేసింది. ఇవి క్లినికల్ ట్రయల్స్‌లో పరీక్షించబడుతున్నాయి. ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందజేస్తుంది. బహుమతి పతకం  10 మిలియన్ స్వీడిష్ క్రౌన్‌లు లేదా $915,072ని కలిగి ఉంటుంది. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో నగదు రూపంలో ఇవ్వబడుతుంది.

మెడిసిన్ , క్వాంటం ఫిజిక్స్ లో నోబెల్ 2022 అక్టోబర్ 3  నుంచి వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అందిస్తున్నారు. ఈ సంవత్సరం స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు ఈ అవార్డు లభించింది. నియాండర్తల్ DNAపై ఆయన చేసిన ఆవిష్కరణలకు గాను ఈ అవార్డును అందుకున్నారు. అక్టోబర్ 4న భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. క్వాంటం ఫిజిక్స్‌లో విశేష కృషి చేసినందుకు గానూ ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. వీరిలో ఫ్రాన్స్‌కు చెందిన అలైన్ ఆస్పెక్ట్, అమెరికాకు చెందిన జాన్ ఎఫ్. క్లోజర్ , ఆస్ట్రియాకు చెందిన ఆంటోన్ జైలింగర్‌లు సంయుక్తంగా ఈ అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ శాస్త్రవేత్తలకు రెండు నోబెల్‌లు వచ్చాయి ఇప్పుడు సాహిత్యంలో నోబెల్ బహుమతిని గురువారం ఇవ్వనున్నారు. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించనుండగా..  ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన నోబెల్ బహుమతిని అక్టోబర్ 10న ప్రకటిస్తారు. కె షార్ప్‌లెస్ రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న శాస్త్రవేత్తల బృందంలో చేరాడు. ఇతర శాస్త్రవేత్తలలో జాన్ బార్డీన్ కూడా ఉన్నారు, అతను భౌతిక శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. వీరితో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీలో మేరీ క్యూరీ, కెమిస్ట్రీ అండ్ పీస్‌లో లైనస్ పాలింగ్ రెండుసార్లు నోబెల్ గెలుచుకున్నారు. రసాయన శాస్త్రంలో ఫ్రెడరిక్ సాంగర్ రెండుసార్లు నోబెల్ బహుమతిని అందుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..