AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CAIRN DISPUTE: న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట.. కెయిర్న్​ ప్రయత్నాలకు అడ్డుకట్ట

అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట లభించింది. అమెరికాలోని ఎయిర్​ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కెయిర్న్​ప్రయత్నాలను న్యూయార్క్​ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

CAIRN DISPUTE: న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట.. కెయిర్న్​ ప్రయత్నాలకు అడ్డుకట్ట
New York Court
Phani CH
|

Updated on: Sep 26, 2021 | 4:45 PM

Share

అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట లభించింది. అమెరికాలోని ఎయిర్​ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కెయిర్న్​ప్రయత్నాలను న్యూయార్క్​ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు (ఆర్బిట్రేషన్​ కోర్టు) ఇచ్చిన తీర్పు మేరకు.. 1.2 బిలియన్​ డాలర్లు రాబట్టుకునేందుకు.. ఆమెరికాలోని ఎయిర్​ ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కెయిర్న్​ ప్రయత్నాలు చేస్తోంది. అయితే రెట్రోస్పెక్టివ్‌ పన్నును రద్దు చేసేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నందున.. అప్పటి వరకు స్టే విధించాలని భారత ప్రభుత్వం న్యూయార్క్ కోర్టును కోరింది. భారత్ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఎయిర్​ఇండియా ఆస్తుల జప్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది.

వివాదం ఎందుకొచ్చింది. 2006లో కెయిర్న్ ఎనర్జీ కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం నోటీసులు జారీ చేసింది. సమాచారాన్ని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని కోరింది. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ ‘కెయిర్న్‌‌ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు. దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ కూడా నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది.

దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. భారత్​.. కెయిర్న్​కు 1.2 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని మధ్యవర్తిత్వ కోర్టులో తీర్పు వెల్లడించింది. భారత్ 1.2 బిలియన్ డాలర్లు కెయిర్న్ చెల్లించకపోవటంతో ఆ కంపెనీ అమెరికాలోని ఎయిర్​ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించింది. దీనిపై భారత్ న్యూయార్క్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు ఎయిర్​ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కెయిర్న్​ ప్రయత్నాలను న్యూయార్క్​ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Aditya Birla AMC IPO: సెప్టెంబర్ 29 నుంచి అదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీఓ

Ganesh Immersion : తాబేళ్లపై ఊరేగుతున్న బుల్లి గణపయ్య.. చూడముచ్చటైన వీడియో

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..