Aditya Birla AMC IPO: సెప్టెంబర్ 29 నుంచి అదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీఓ
అదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సెప్టెంబర్ 29న ఐపీఓకు రానుంది. అదిత్య బిర్లా ఏఎంసీ పబ్లిక్ ఆఫర్ ధరను రూ.695-712గా నిర్ణయించింది. ఈ ఐపీఓ సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 1న ముగుస్తుంది.
అదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సెప్టెంబర్ 29న ఐపీఓకు రానుంది. అదిత్య బిర్లా ఏఎంసీ పబ్లిక్ ఆఫర్ ధరను రూ.695-712గా నిర్ణయించింది. ఈ ఐపీఓ సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 1న ముగుస్తుంది. అక్టోబర్ 6న షేర్లు కేటాయిస్తారు. షేర్ల రాని వారికి అక్టోబర్ 7న డబ్బులు రిఫండ్ అవుతాయి. కేటాయించిన షేర్లు అక్టోబర్ 8న డిమాట్ అకౌట్లో చెరుతాయి. కంపెనీ.. ఆఫర్ ఫర్ సెల్ ద్వారా రూ.2,768. 26 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రిటైలర్‌కు 35 శాతం కేటాయించారు. ఐపీఓలో లాట్ సైజ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్క లాట్లో 20 షేర్లు ఉంటాయి. 14 లాట్ల వరకు కొనుగోలు చేయవచ్చు. ఒక్క లాట్ ధర రూ.14, 240గా ఉంది. అదిత్య బిర్లా ఏఎంసీ అక్టోబర్ 11న బీఎస్సీ, ఎన్ఎస్సీలో లిస్ట్ కానుంది.
ఐపీఓ అంటే ఏమిటి? ఐపీఓ అంటే(initial public offering). ఏదైనా కంపెనీని విస్తరించాలని నిర్ణయించి.. దానికి పెట్టుబడిని సేకరించడాన్ని ఐపీఓగా చెబుతారు. ఉదాహరణకు రాము అనే వ్యక్తి A అనే కంపెనీని రూ.100 కోట్లతో ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత అ కంపెనీని విస్తరించాలనుకున్నారు. కానీ అతని వద్ద డబ్బు లేదు. బ్యాంకు నుంచి తీసుకొస్తే ఎక్కువ వడ్డీ అవుతుంది. అప్పుడు అతను పెట్టుదారుల నుంచి డబ్బు సేకరించాలని ఐపీఓగా వస్తారు. ఐపీఓకు వచ్చే ముందు ఆ కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని సెబీకి పంపుతారు. సెబీ ఓకే అన్న తర్వాతే ఏ కంపెనీ అయినా ఐపీఓకు రావాల్సి ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Immersion : తాబేళ్లపై ఊరేగుతున్న బుల్లి గణపయ్య.. చూడముచ్చటైన వీడియో
ఎల్‌ఐసీ నుంచి ప్రీమియం చెల్లించకుండా 75 వేల ప్రయోజనం..! పిల్లలకు స్కాలర్‌షిప్ అవకాశం..?