Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్‌ఐసీ నుంచి ప్రీమియం చెల్లించకుండా 75 వేల ప్రయోజనం..! పిల్లలకు స్కాలర్‌షిప్ అవకాశం..?

Aam Aadmi Bima Yojana: ఆమ్ ఆద్మీ బీమా యోజన గురించి చాలా మందికి తెలియదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీనిని LIC నిర్వహిస్తుంది ఈ పథకం సామాజిక భద్రత పథకం.

ఎల్‌ఐసీ నుంచి ప్రీమియం చెల్లించకుండా 75 వేల ప్రయోజనం..! పిల్లలకు స్కాలర్‌షిప్ అవకాశం..?
Money
Follow us
uppula Raju

|

Updated on: Sep 26, 2021 | 4:29 PM

Aam Aadmi Bima Yojana: ఆమ్ ఆద్మీ బీమా యోజన గురించి చాలా మందికి తెలియదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీనిని LIC నిర్వహిస్తుంది ఈ పథకం సామాజిక భద్రత పథకం. ఇది ప్రధానంగా గ్రామీణ భూమిలేని కుటుంబాలకు సంబంధించినది. ఈ పథకం అకాల మరణం, ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. కుటుంబ ఖర్చులను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ స్కీమ్ తీసుకోవడానికి దరఖాస్తుదారు వయస్సు 18-59 సంవత్సరాల మధ్య ఉండాలి. అతడు కుటుంబ పెద్ద అయి ఉండాలి. లేదా BPL కుటుంబంలో సంపాదిస్తున్న సభ్యుడు ఈ పథకాన్ని తీసుకోవచ్చు.

మీకు ఎంత డబ్బు వస్తుంది ఈ ప్లాన్‌లో 5 ప్రయోజనాలు ఒకేసారి లభిస్తాయి. దరఖాస్తుదారుడు సహజ కారణాల వల్ల మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబానికి రూ.30,000 అందిస్తారు. ప్రమాదవశాత్తు మరణిస్తే అతని నామినీకి రూ.75,000 చెల్లిస్తారు. ప్రమాదంలో కుటుంబ పెద్ద శారీరకంగా వికలాంగుడైతే రూ.75,000 అందిస్తారు. ప్లాన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు 9 వ తరగతి నుంచి12 వ తరగతి వరకు ప్రతి నెలా రూ.100 స్కాలర్‌షిప్ అందిస్తారు.

ప్రీమియం ఉచితం ఆమ్ ఆద్మీ బీమా యోజన ప్రీమియం సంవత్సరానికి రూ. 200. ఇందులో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. మొత్తంమీద ఒక వ్యక్తి ఈ స్కీమ్ ప్రయోజనాన్ని ఉచితంగా పొందుతాడు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి 5 పత్రాలను సమర్పించాలి. రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల సర్టిఫికేట్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డు అందించాలి.

ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ ఎలా చేస్తారు.. ఈ పథకంలో ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ డబ్బు NEFT ద్వారా లబ్ధిదారుడి ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రమాదం జరిగిన తర్వాత దరఖాస్తు దారు బతికుంటే అతడి ఖాతాలో డబ్బు జమ చేస్తారు. ఒకవేళ మరణిస్తే అతడి నామినీ ఖాతాలో LIC ద్వారా డబ్బు జమ అవుతుంది.

Gulab Cyclone: అవసరమైతే కేంద్రం నుంచి సాయం.. సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌.. ‘గులాబ్’ పరిస్థితులపై ఆరా..

AP Weather Report: రాగల మూడు రోజులలో ఏపీలో భారీ వర్షాలు.. ఆ 3 జిల్లాలలో హై అలర్ట్..

PM Modi Assets: మన కేంద్ర మంత్రులలో అత్యధిక ఆస్తులున్నది ఆయనకే! ప్రధాని మోడీ ఆస్తుల విలువ వాటికంటే చాలా తక్కువ!