AP Weather Report: రాగల మూడు రోజులలో ఏపీలో భారీ వర్షాలు.. ఆ 3 జిల్లాలలో హై అలర్ట్..
AP Weather Report: నిన్న ఏర్పడిన గులాబ్ తుపాను ఈరోజు ఉదయం 08:30 నిమిషాలకు వాయువ్య & దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో
AP Weather Report: నిన్న ఏర్పడిన గులాబ్ తుపాను ఈరోజు ఉదయం 08:30 నిమిషాలకు వాయువ్య & దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో 18.4°N అక్షాంశము, 86.4°E రేఖాంశము వద్ద గోపాల్ పూర్‌కి తూర్పు-ఆగ్నేయ దిశల180 km దూరంలో & కళింగపట్నంకి తుర్పు-ఈశాన్య దిశలో 240 km దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుపాను పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఈరోజు అర్ధరాత్రి ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలలో కళింగపట్నం & గోపాల్ పూర్‌ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 75 – 85 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల రాగల మూడు రోజుల వరకు ఏపీలో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.