PM Modi Assets: మన కేంద్ర మంత్రులలో అత్యధిక ఆస్తులున్నది ఆయనకే! ప్రధాని మోడీ ఆస్తుల విలువ వాటికంటే చాలా తక్కువ!

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల విలువ కంటే.. ఆయన మంత్రివర్గ సహచరుల ఆస్తి విలువే ఎక్కువ. ప్రధాని మోడీకి సొంత కారు కూడా లేదనే విషయం మీకు తెలుసా? ప్రధాని మోడీ ఆస్తులు ఇవే..

PM Modi Assets: మన కేంద్ర మంత్రులలో అత్యధిక ఆస్తులున్నది ఆయనకే! ప్రధాని మోడీ ఆస్తుల విలువ వాటికంటే చాలా తక్కువ!
Pm Modi Assets
Follow us
KVD Varma

|

Updated on: Sep 26, 2021 | 3:40 PM

PM Modi Assets: భారత ప్రధాని ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. మన ప్రధాని కంటే ఆ మాట కొస్తే.. మన కేంద్ర మంత్రి వర్గంలోని మంత్రులందరి కంటే, మన హోమ్ మంత్రి అమిత్ షా ఆస్తుల విలువే ఎక్కువ. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఇతర మంత్రులు ఎవ్వరూ కూడా స్టాక్ మార్కెట్ లో తమ పెట్టుబడులు పెట్టలేదు. ఈ విషయంలో అందరూ సంప్రదాయవాదులుగానే ఉన్నారు. వీరు ఎక్కువగా బీమా పాలసీలలో పెట్టుబడి పెడతారు. అదేవిధంగా ప్రధాని మోడీ వద్ద కూడా 1.5 లక్షల రూపాల విలువ చేసే బీమా పాలసీలున్నాయి. ఇక 2012లో అయన 20 వేల రూపాయల విలువైన L&T ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్‌లు కొనుగోలు చేశారు.

మోడీకి 3.07 కోట్ల విలువైన ఆస్తులు

అధికారిక గణాంకాల ప్రకారం, మార్చి 31, 2021 నాటికి మోడీకి రూ. 3.07 కోట్ల ఆస్తులు ఉన్నాయి. దీని ప్రకారం, వాటి నికర విలువ రూ. 2.85 కోట్ల నుండి ఒక సంవత్సరం క్రితం రూ. 22 లక్షలు పెరిగింది. SBI గాంధీనగర్ శాఖలో నడుస్తున్న ప్రధాని మోడీ FD విలువ పెరగడమే దీనికి కారణం.

1.86 కోట్ల FD

ప్రధానమంత్రి అఫిడవిట్ ప్రకారం, మార్చి 31 నాటికి, ఆయన 1.86 కోట్ల FD కలిగి ఉన్నారు. ఇది ఒక సంవత్సరం క్రితం రూ .1.6 కోట్లు. ప్రధాని మోడీకి సొంత వాహనం కూడా లేదు. అదేవిధంగా, మోదీ వద్ద రూ .1.48 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఆయన బ్యాంక్ ఖాతాలో రూ .1.5 లక్షల సొమ్ము వుంది. చేతిలో రూ.36,000 నగదు ఉంది.

1.1 కోట్ల ఇల్లు

2014 లో ప్రధాని అయిన తర్వాత మోడీ ఎలాంటి కొత్త ఆస్తిని కొనుగోలు చేయలేదు. 2002 లో కొనుగోలు చేసిన ఇల్లు ప్రస్తుతం విలువ రూ .1.1 కోట్లు. మొత్తం 14,125 చదరపు అడుగుల ఈ ఇంట్లో, పావు వంతు వాటా మాత్రమే మోడీది.

PM వెబ్‌సైట్‌లో సమాచారం

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో, కేంద్ర మంత్రులందరూ తమ ఆస్తులు, అప్పులను స్వచ్ఛందంగా వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ నాయకుల జీవితాల్లో మరింత పారదర్శకత తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ సమాచారాన్ని పబ్లిక్, PM వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

మోడీ ప్రభుత్వంలో అత్యంత ధనవంతుడైన మంత్రి అమిత్ షా..

ఇంగ్లీష్ బిజినెస్ న్యూస్ పోర్టల్ మింట్ ప్రకారం, మోదీ ప్రభుత్వంలో అమిత్ షా అత్యంత ధనవంతుడు. 31 మార్చి 2021 నాటికి ఆయన నికర ఆస్తుల విలువ 37,91,50,580 అంటే దాదాపు 38 కోట్లు. గత ఏడాది రూ.28.63 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల నికర విలువ రూ .9.28 కోట్లు పెరిగింది.

13.56 కోట్ల విలువైన 10 స్థిరాస్తులు

షా వద్ద 10 స్థిరాస్తులు ఉన్నాయి. అన్నీ గుజరాత్‌లో ఉన్నాయి. ఆయన సొంత సంపాదన నుండి కొనుగోలు చేసిన ఆస్తి.. అలాగే, ఆయన తల్లి నుండి వారసత్వంగా పొందిన ఆస్తి మొత్తం విలువ రూ.13,56,08,593 (రూ.13.56 కోట్లు). ఆయన సొంతంగా కొనుగోలు చేసిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.5,71,08,593 (రూ. 5.71 కోట్లు) కాగా వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ రూ .7,85,00,000.

Also Read: PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..

Ayushman Bharat: రూ .5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులో తెలుసుకోండి..