Newly Married Couples: హనీమూన్ లేదా లాంగ్‌టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ సీజన్‌లో ‘బెస్ట్ అప్షన్’ ఊటీ ఎందుకంటే..

Newly Married Couples:కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.. దీంతో దేశంలోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను కరోనా నిబంధనల నడుమ పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. నిజానికి వేసవి కంటే..

Newly Married Couples: హనీమూన్ లేదా లాంగ్‌టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ సీజన్‌లో 'బెస్ట్ అప్షన్' ఊటీ ఎందుకంటే..
Ooty Honeymoon Place

Newly Married Couples: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.. దీంతో దేశంలోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను కరోనా నిబంధనల నడుమ పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. నిజానికి వేసవి కంటే.. ఈ సీజన్ లోనే పర్యాటక ప్రాంతాలను విజిట్ చేస్తే బాగుంటుంది. రమణీయమైన ప్రకృతి, నీలి మబ్బులు.. పచ్చని కోక కట్టుకున్న పడతిలా కనిపిస్తూ కనులకు విందు చేస్తుంది. దీంతో కొత్త జంటలు..  హనీమూన్ లేదా లాంగ్‌టూర్ ప్లాన్ చేస్తుంటే.. భారత్ లోని ఫేమస్ టూరిస్టు ప్రాంతం ఉదకమండలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం ఊటీ. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది కనుక వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. అయితే ఊటీ అందాలను వీక్షించాలనుకుంటే మాత్రం ఆక్టోబర్ నుంచి జనవరి మధ్య అనుకూలం. ఊటీ సరస్సు, దొడ్డబెట్ట, రోజ్‌గార్డెన్, ఏవలాంచ్ లేక్ వంటివి ప్రముఖ సందర్శనీయ ప్రాంతాలు. ఊటీ వెళ్లేందుకు కోయంబత్తూర్ వరకు ఫ్లైట్‌లో వెళ్లవచ్చు. అదే ట్రైన్ ద్వారా వెళ్లాలనుకుంటే మాత్రం మెట్టుపాళ్యం స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది.

ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. అనంతరం గంగ వంశ రాజుల ఆధీనంలోకి వచ్చాయి. ఇక 12వ శతాబ్దంలో హోయసాల వంశ రాజైన విష్ణువర్థనుడి స్వాధీనంలోకి వచ్చిన నీలగిరి పర్వతాలు.. చివరకు టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చాయి., అనంతరం 18వ శతాబ్దంలో బ్రటిష్ వారి పాలనలోకి చేరుకున్నారు. ఊటీ లోని వాతావరణం కోయంబత్తూర్ ప్రావిన్సుకు గవర్నరుగా ఉన్న జాన్ సుల్లివాన్ ను అమితంగా ఆకర్షించింది. దీంతో అడవులను చూసి ముచ్చటపడి.. అక్కడ నివసిస్తున్న కోయజాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని ఖరీదు చేశాడు. నెమ్మదిగా బ్రిటిష్ వారు పర్వత ప్రాంతాల్లోని స్థలాలను ఆక్రమించుకున్నారు. దీంతో అప్పటి మద్రాస్ సంస్థానికి వేసవి రాజధానిగా నీలరిగి ప్రాంతం మారింది.

ఊటీ వాతావరణం సాధారణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా, చల్లగా ఉంటుంది. పర్యాటకులను అన్ని సీజన్లలోనూ ఆకర్షిస్తుంది. ఊటిలో ఆర్థిక రంగం ఎక్కువగా పర్యాటక రంగంపై ఆధారపడివుంది. ఊటీలో కూరగాయలు, పండ్లు పండిస్తారు. క్యారెట్, బంగాళదుంప, క్యాబేజీ, కాలీఫ్లవర్, పీచస్, రేగు, బేరి, స్ట్రాబెర్రీ పండిస్తారు. ఊటీ మున్సిపల్ మార్కెట్ వద్ద రోజూ జరిగే ఉత్పత్తుల వేలంపాట భారతదేశంలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్లలో ఒకటిగా ఖ్యాతిగాంచింది. అంతేకాదు ఇక్కడ పాడి పరిశ్రమ కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారు అయ్యే చాక్లెట్లు ప్రసిద్ధిగాంచాయి. ఇక సినిమా షూటింగ్స్ కూడా ఊటీ పరిసర ప్రాంతాలు అనువైనవి.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషా చలన చిత్రాలు సందర్భానుసారంగా ఊటీలో చిత్రీకరణ జరుపుకుంటాయి. మొత్తానికి ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఊటీ అందాలను చూడాలని.. కోరుకునే విధంగా ఉంటుంది. ఇక్కడకు వెళ్లాలంటే ఇద్దరికీ సుమారు 25 వేల నుంచి 40 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది.

Also Read: Balakrishna: బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలు .. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం.. ఈ హీరోలకు వెరీవెరీ స్పెషల్..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu